అంజీర పండ్ల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

kalpana
సాధారణంగా మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు లభించాలంటే పౌష్టికాహారంతో పాటు తాజా పండ్లను తీసుకోవాలని చెబుతుంటారు. ఈవిధంగా పోషక విలువలు మెండుగా లభించే వాటిలో అంజీర పండ్లు ఒకటని చెప్పవచ్చు. ఈ అంజీర పండ్లను తీసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో అంజీర పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా లభిస్తాయి.                                               
శరీర బరువును తగ్గాలనుకొనేవారు ప్రతిరోజు అంజీర పండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతారు. అయితే ప్రతిరోజు కేవలం నాలుగు లేదా ఐదు అంజీర పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారిలో రక్తం అభివృద్ధి చెందుతుంది. అంజీర పండ్లలలో ఎక్కువగా క్యాల్షియం, సోడియం, ఐరన్, విటమిన్లు విరివిగా లభిస్తాయి. పొటాషియం తక్కువగా ఉండే ఈ అంజీర పండ్లను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య తో బాధపడేవారు విముక్తి పొందవచ్చు.
అంజీర పండ్లు పురుషులలో లైంగిక సమస్యలను దూరం చేయడమే కాకుండా శుక్ర కణాల ఉత్పత్తిని కూడా అధికం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మహిళలలో రొమ్ము క్యాన్సర్ ను నివారించడానికి తోడ్పడతాయి. ఫైల్స్ సమస్యతో బాధపడేవారు అంజీర పండ్లను నానబెట్టిన నీటిని త్రాగటం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా తలలో చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ అంజీర పండ్లతో మర్దన చేయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా నిత్యం యవ్వనంగా కనిపించడం కోసం అంజీర పండ్లను తినటం వల్ల చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: