మునగాకు లో ఉండేఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు...!

kalpana
మునగ కాయ గురించి మనందరికీ తెలుసు. కూరగాయలతో సాంబారు,రసం, సూప్ వంటి వంటలు చేస్తారు.  మునక్కాయలురుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి చాలా మంచివి. ఎక్కువగా మునక్కాయలు వాడడం తెలుసు. కానీ మునగ ఆకు లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు,  ఔషధాలుచాలా ఉన్నాయి మునగాకు వాడటం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
 తప్పు మునగాకు రసం తీసుకొని బాగా వేడి చేసి చల్లారిన తర్వాత పైన ఉన్న నీటిని తొలగించాలి. మిగిలిన పదార్థంలో పాలు కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు తీసుకోవడం వల్ల పిండము చక్కగా పెరిగి
సుఖప్రసవం జరుగుతుంది. మునగాకు రసంలో ఉండే క్యాల్షియం, ఐరన్, విటమిన్లు బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. బాలింతలకు పాలు వృద్ధి చెందుతాయి.
 మూత్ర విసర్జనలో మంట, మూత్రపిండ వ్యాధులు. మలబద్ధకం వంటి సమస్యలకు బాగా మరగించి చల్లార్చిన మునగాకు రసం ఒక స్పూన్ మోతాదులో తీసుకొని ఒక గ్లాసు క్యారెట్ రసంలో కలుపుకోవాలి. మిశ్రమాన్ని తాగడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గుతాయి.
 ప్రతిరోజూ పడుకునేముందు ఒక స్పూన్ మునగాకు రసంలో కొద్దిగా తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల రేచీకటి తగ్గుతుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
 ఒక స్పూన్ మునగాకు రసంలో కొద్దిగా తేనె,నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల తల తిరుగుడు, మొలలు, ఎక్కిళ్ళు,అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
దెబ్బలకు,బెణుకు నొప్పులకు మునగాకు కూర బాగా వేడిచేసి వాడి వాటిపై పెట్టుకుంటే నొప్పి, బాధ తగ్గుతాయి.
 మొటిమలకు మునగాకు రసం బాగా పనిచేస్తుంది. మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా ముఖం కాంతివంతంగా ఉంటుంది.
 గజ్జి,దురద వంటి చర్మ వ్యాధులకు మునగాకు రసం నువ్వుల నూనె కలిపి నీరు ఆవిరయ్యే వరకూ మరగించాలి. ఆ మిశ్రమాన్ని గజ్జి,  దురద ఉన్నచోట రాయడం వల్ల తగ్గిపోతాయి.
 తలనొప్పి బాధిస్తుంటే ఒక స్పూన్ మునగాకు రసంలో మిరియాల పొడి కలిపి తన తలపై పెట్టుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: