శీతాకాలం అనారోగ్యాలకు

Durga
 జలుబు, దగ్గు, తుమ్ము, పడిశం , వంటి వాటన్నింటికీ మందులు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. అయితే అవన్నీ వాడితే తాత్కాలిక ఉపశమనం తప్ప పూర్తిగా తగ్గవు. వాటికి బదులు ఇంట్లోనే లభించే తులసి మొక్క, ఆహారంలో వాడే అల్లం, మిరియాలు, ధనియాలు, లవంగాలు వంటివి వాడి జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి, అల్లం, మిరియాలు కలిపిన కషాయం తయారు చేసుకుని శీతాకాలం అనారోగ్యాలు చాలావరకు తొలగిపోతాయి. ధనియాలు, మిరయాలు పొడిచేసి నీళ్లలోవేసి మరిగించి. ఆ కషాయాన్ని తాగినా గొంతునొప్పి, దగ్గు తగ్గుతుంది. మిరియాల కషాయం నేరుగా తాగలేనివారు. మిరియాలపొడిని వేడిపాలల్లో వేసుకొని తాగితే మంచిది. ఒక లవంగాన్ని కాల్చి తేనెతో అరగదీసి అది తిన్నా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: