జాజికాయ ఉపయోగాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Divya

మనకు తెలిసినంత వరకూ జాజికాయను కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే ఉపయోగిస్తారు. జాజికాయ మన ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం మనకు ఎంత మాత్రం తెలియదు. జాజికాయ మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. జాజికాయ,జాజి ఆకులు,జాజి పువ్వులను పేస్టులా చేసుకొని వాడడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాలైన లాభాలు చేకూరుతాయని వైద్య నిపుణులతో పాటు ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.  జాజికాయ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
జాజికాయ చెవి పోటు నుంచి పన్ను నొప్పి వరకు అన్ని రకాల వ్యాధులను అరికడుతుంది.నోటిపూతతో బాధపడేవారికి, జాజికాయ ఆకులు బాగా పనిచేస్తాయి.జాజికాయ ఆకులను తరచూ నమిలి మింగడం వల్ల నోటి అల్సర్లు తగ్గిపోతాయి. ఇక జాజీ  ఆకుల రసాన్ని మింగలేము అనుకునేవారు, జాజి ఆకుల రసాన్ని కషాయము చేసుకొని పుక్కిలించడం వల్ల నోటి సంబంధిత వ్యాధులు దరిచేరవు.
జాజి ఆకుల రసంలో కొద్దిగా నువ్వుల నూనె వేసి, నీరు ఇమిడేదాకా మరిగించాలి. అలా మరిగించిన నూనెను చెవి పోటు ఉన్నప్పుడు చెవిలో రెండు చుక్కలు వేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. జాజిపువ్వులను మెత్తగా నూరి,ముఖానికి పట్టించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా మొటిమలు, నల్లటి మచ్చలు,  ముడతలు తగ్గి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.
జాజి ఆకుల రసాన్ని తరచూ పగిలిన కాళ్ళకు పట్టించడం ద్వారా త్వరగా పగుళ్లు నయం అవ్వడంతో పాటు కాళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు దరిచేరవు.ఇక జాజికాయ నన్ను మెత్తగా రుబ్బి పొడి చేసుకోవాలి. ప్రతిరోజు పావు టీ స్పూను చొప్పున రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్ధకం సమస్యల నుంచి కాపాడుతుంది. కిడ్నీలో రాళ్లు సైతం కలిగించే శక్తి జాజికాయపొడి ఉంది.  రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తుంది. అంతేకాకుండా తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ జాజి కాయ మంచి ఔషదంగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: