ఆరోగ్యం: మినప్పప్పు తింటే బరువు తగ్గుతారా.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..!!

Kavya Nekkanti

అధిక బ‌రువు.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌. ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు చాలా మంది. నోరు కట్టేసుకోవడంతోపాటు గంటల తరబడి వ్యాయామం చేసినా ఒక్క కిలో బరువు కూడా తగ్గదు. వాస్త‌వానికి తినకుండా ఉంటే బరువు తగ్గిపోతామని అనుకుంటారు. నిజానికి అలా చెయ్యకూడదు. ఎందుకంటే మన బరువుకి తగ్గట్టు తగినంత ఫుడ్ బాడీకి ఇవ్వకపోతే చాలా అవయవాలు సరిగా పనిచెయ్యవు. దీంతో మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

 

అధిక బరువు ఒత్తిడి, నిద్రలేమి, శారీరక రుగ్మతలు, ఆహారపుటలవాట్లు కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. ఇక ఈ అధిక బ‌రువు వ‌ల్ల చూడడానికి లావు గా కనపడడమే కాకుండా అధిక బరువు వల్ల టైప్ 2 డయాబెటీస్, గుండె జ‌బ్బులు, హైబీపీ వంటి దీర్ఘ కాలిక రోగాలు వచ్చే ముప్పు ఎక్కువ ఉంది. అందుకే స‌రైన ప‌ద్ధ‌తిలో బ‌రువు త‌గ్గించుకోవాలి. అయితే బ‌రువు త‌గ్గించ‌డంలో మిన‌ప్ప‌ప్పు బాగా స‌హాయ‌ప‌డుతుంది. నిత్యావసరాల్లో ఒకటైన మినప్పప్పు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే.. ఇడ్లీ నించీ దోసె వరకూ మనం వాడే పప్పు మినప్పప్పు. 

 

మినప్పప్పు లో ఉన్న ఫైబర్ వలన కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. మినప్పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. మినప్పప్పుతో చేసిన ఆహారం తిన్నాక బింజ్ ఈటింగ్ వైపు మనసు పోకుండా ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ వల్ల ఆక్సిజెన్ శరీరానికంతటికీ అందుతుంది. దాంతో చురుకుదనం పెరుగుతుంది. అది సహజంగానే బరువు తగ్గడానికి దారి తీస్తుంది. కాబ‌ట్టి, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఖ‌చ్చితంగా డైట్‌లో మిన‌ప్ప‌ప్పు చేర్చుకుంటే మంచిది. అలాగే ఇందులో ఉండే ఫోలిక్ ఆసిడ్ వలన ప్రెగ్నెంట్స్ కూడా ఈ పప్పును ఎలాంటి భ‌యం లేకుండా తినవ‌చ్చు. మిన‌ప్ప‌ప్పుతో.. మినప వడలు, మినపట్టు, ఇడ్లీలు, దోసెలు,  సున్నుండలు ఇలా ర‌క‌ర‌కాల వంట‌లు చేస్తారు. అయితే ఈ పప్పు ని రోజువారీ ఆహారంలో ఎలా తిన్నా మంచిదే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: