ఈ పండు తింటే మీ గుండె పదిలం !!

Shyam Mohan

ఈ పండు తింటే మీ గుండె పదిలం !! సీజన్ల వైజ్‌గా దొరికే అనేక రకాల పండ్లలో పియర్స్‌ పండ్లు చాలా విలువైనవంటున్నారు. శరీరానికి అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి.

మిగతా పండ్ల సంగతి ఎలా ఉన్నా, పియర్స్‌ పండ్లను తరచూ తినడం వల్ల అంతులేని ఫలితాలుంటాయంటున్నారు పోషకాహార నిపుణులు.

1, ఒక కప్పు పియర్స్‌ పండ్ల ముక్కల్లో 5 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. అందువల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా పెరిగి, హాని కలిగించే, చెడు బాక్టీరియా నశిస్తుంది.

2 . పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండాలన్నా.. నిత్యం సుఖ విరేచనం అవ్వాలన్నా.. రాత్రి పూట ఒక పియర్స్‌ పండును తినాలి. ఈ పండ్ల వల్ల మలబద్దకం తగ్గుతుంది.

3. ఈ పండ్లను రెగ్యులర్‌గా తింటే హార్ట్‌ స్ట్రోక్స్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని డచ్‌ సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. పియర్స్‌ పండ్ల వల్ల స్ట్రోక్స్‌ వచ్చే అవకాశాలు 52 శాతం వరకు తక్కువగా ఉంటాయట.

విదేశాల్లో పండుతున్న ఈ పండ్లు ఇటీవల హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లో దొరుకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: