ఆరోగ్యానికి అమృతం వంటిది వెల్లుల్లి

Durga
 వెల్లుల్లి లిన్నేయస్ అనే కుటుంబజాతి యెక్క దీన్ని సంస్కృతంలో రసోనా, ఉగ్రగంథ, లశునా అని హిందీలో లహసూన్ అని లాటిన్ లో ఆలియం సెటైనమ్ లిన్నెయస్ అంటారు. కొందరు పెద్దలు అనేదేమంటే వెల్లుల్లి బ్రహ్మసృష్టి అయితే, నీరుల్లి విశ్వామిత్ర సృష్టి అని అంటారు. ఏది ఏమైనా మానవజాతికి ఆరోగ్యాన్ని సమకూర్చడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిచడంలో ఈ రెండూ దేనికవేసాటి. వెల్లుల్లి పురాతనకాలం నుండి సౌందర్యపోషకంగానూ పేరుపొందింది. ఆధునిక పరిశోధనలు కూడా ఈ వాదానికి బలం చేకూర్చాయి. పురాతన ఈజిప్టు నాగరికతలో శాస్త్రజ్ఞులు కనుగొన్న ఆహారపధార్థాలలో వెల్లుల్లి ముఖ్యమైనది. ప్రాచీన రోమనులు అబిసీనియనులు, ఆఫ్షన్లు వెల్లుల్లికి దుష్టశక్తిలను పాద్రోలే శక్తి ఉందని నమ్మేవారు. కొందరు వెల్లుల్లి పుట్టక గురించి ఓ పిట్టకధ చెబుతుంటారు. గరుత్మంతుడు ఆకాశమార్గంలో అమృతాన్ని తీసుకునివెళుతున్న సమయంలో అమృతబాంఢం నుంచి కొన్ని చుక్కలు జారి భూమి మీద పడ్డాయి. ఆ పడ్డ ప్రదేశంలో వెల్లుల్లి మొక్కలు మొలిచాయనీ, ప్రపంచ ప్రజలందరూ దీనిని స్వీకరించారనీ, ఈ విధంగా వెల్లుల్లి విశ్వవ్యాప్తమయిందనీ చెబుతారు. దీనిలో వాస్తవమెంత ఉన్నదన్న విషయాన్ని పక్కన పెడితే వెల్లుల్లి ఆరోగ్యవర్థనిగా అమృతతుల్యమనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వెల్లుల్లి వివిధ జబ్బులకు చికిత్స విధానంగా పనిచేయడంలో సాటిలేదు. అంతేకాక సౌందర్యసాధనంగా కూడా ఇది తోడ్పడుతుంది. కాని, కొన్ని ఆచారాలలో, పద్దతులు ప్రకారం కొందరు తెల్లుల్లిని దూరంగా ఉంచుతారు. సాధారణంగా మన దక్షిణ బారతదేశంలోని కొన్ని ప్రాచీన బ్రాహ్మణ కుటుంబాలలలో. వైశ్య కుటుంబాలలో దీనిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. సాధారణంగా నీరుల్లి తినేవారు కూడా కొందరు వెల్లుల్లిని ధరిచేరనీయరు. దీనికి కారణం ఏమిటనేది మనకు శాస్త్రీయంగా రుజువుకాలేదు. మొదటి ప్రపంచ యుద్దంలో గాయపడిన సైనికుడు, గాయాలకు సెప్టిక్ కాకుండా వెల్లుల్లినే వాడేవారు. దీనివల్ల యాంటిసెప్టిక్ గుంణం ప్రపంచానికి తెలిసిందే. ఎలిలిన్, ఎల్లిసిన్ వంటి ఔషధాల గుణాల దీనిలో ముఖ్యమైనవి. గర్భవతులకు ఆరేడు నుంచి బిడ్డ పుట్టబోయే వరకు రోజుకు ఒక వెల్లుల్లి రెబ్బ తినిపించినా, ఇటుతల్లికి, పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యంధాయనిగా పనిచేస్తుంది. నిత్య జీవితంలో మనం అనేక రకాల ఔసధీయుక్త ఆహారపధార్థాలను వినియోగిస్తున్నా, చాలా మందికి వీటిలోని ఔషధ విలువలు తెలియవు. కొన్ని రకాల వస్తువులు మనం నిత్యం వాడుతూనేవుంటాము. కాని వాటివల్ల మనకు చేకూరే ప్రయోజనం మనకు తెలియకుండానే వాడుతున్నాం. ఈ విధంగా తెలియనివారు ఎంతో మంది ఉన్నారు. మన వంటిట్లో ప్రత్యేకించి అల్లం, వెల్లుల్లి, లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు మొదలైన దినుసుల్ని ఆహారపధార్థాలలో సమ్మిళితం చేయడం ద్వారా పలు రకాల దీర్ఘకాలవ్యాధుల్ని అదుపులో ఉంచడానికి, పలు తరుణవ్యాధులు మన దరిచేరకుండా ఉండటానికి ఎంతో దోహదం చేస్తాయని ఎందరికి తెలుసు. ఇపుడిపుడే చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి పధార్థాల్ని గురించి తెలుసుకుని మరీ వాడుతున్నారు. ఒక విధంగా కొంత ఎక్కువగానే వాడుతున్నారు. అలా వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవు. కాని వీటినే ఎక్కువగా తీసుకుంటూ మిగిలిన మాంసకృత్తులు, విటమిన్లు, పీచుపధార్ధాలను విస్మరిస్తే కొన్ని దుష్పలితాలు తప్పవని అందరూ గ్రహించాలి. ఇటీవల కాలంలో మానవ జీవ ప్రమాణాలు, ఆధాయమార్గాలు పెరగడంతో అధికంగా కొవ్వు పధార్థాలు, రసాయనయుక్త పధార్థాలు, పిండిపధార్థాలు కలిపిన ఫాస్టు ఫుడ్సు వంటివి, స్వీట్లు మొదలైనవి ఎక్కువగా వినియోగించుతుండడంతో చాలా మంది స్థూలకాయలైపోతున్నారు. దీనికి తోడు అందరికీ అందుబాటులో ఉన్న రవాణామార్గాల వల్ల నడక కూడా తగ్గింది. అందువల్ల స్థూలకాయం సమాజంలో దాదాపు ఒక సమస్యగా మారింది. వెల్లుల్లిలోని సుగుణం ఏమిటంటే అనవసరంగా ఏర్పడిన కొవ్వును కొలెస్టరాల్ ను కరిగించి శరీరానికి కావాలసిన ఖనిజపధార్థాలను ఇతర ఆహారపధార్థాల ద్వారా సమర్థవంతంగా శరీరం స్వీకరించేటందుకు దోహదపరుస్తుంది. వెల్లుల్లిని ఉబ్బసం, రక్తపోటు, రక్తం గడ్డకట్టుట, ఎనిమియా, గుండెజబ్బులు, మానసిక ఆందోళన, మధుమేహం మొదలైన వ్యాధులలో విరివిగా ఉపయోగించుకోవచ్చు. వెల్లుల్లి జీర్ణవ్యవస్థకు మంచిది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కార్భోహైడ్రేట్స్ పెరగడం వల్ల వచ్చే దుష్పరిణామాలు, మధుమెహరోగుల్లో వచ్చే గుండెజబ్బులకు నిరోధంగా బా పనిచేస్తుంది. వెల్లుల్లి ఒక ఏకవార్షికగుల్మము, ఈ మొక్కను దాదాపు దేశమంతటా పెంచుతున్నారు. వెల్లుల్లి మన నిత్యజీవితంలో ఆహారంగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి లోని ఔషధ గుణాలు అపారము.వెల్లుల్లి మధుర లవణ కటుతిక్త కషాయ రసాలు, స్నిగ్ధ గురు తీక్ష్మగుణాలు ఉష్ణవీర్యము మరియు కటువిషాకములను కలిగివుంది. వెల్లుల్లిని ఆస్త్మ, దగ్గు, ప్రణాలు, గుల్మము, శూల, హృద్రోగాలు, అజీర్ణము, చర్మవ్యాధులు, వాపు క్షయ మరియు అస్థిభగ్నము (ఎముకలు విరుగుట) అనే వ్యాధులందు విరివిగా ఉపయోగిస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: