పసిడి ప్రియులకు శుభవార్త..ఈరోజు కూడా తగ్గిన బంగారం,వెండి ధరలు..!

Satvika
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..ఈ మధ్య బంగారం, వెండి ధరలు భారీగా కిందకు దిగి వస్తున్నాయి..గత కొన్ని రోజులుగా ధరలు దిగి వస్తున్నాయి.నిన్నటి ధరలతో నేడు మార్కెట్ లో ధరలు భారీగా తగ్గినట్లు నిపుణులు అంటున్నారు..దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,400లు ఉంది. ఐతే ఈ రోజు నాటికి ధరల్లో రూ.10ల మేర తగ్గి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ.50,390ల వద్ద కొనసాగుతున్నాయి. 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,619లు, 24 క్యారెట్ల బంగారం రూ.5,039లు ఉంది.

ఈ రోజు బంగారం ధరలు ప్రధాన మార్కెట్ లో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము..ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, చెన్నై, లక్నో వంటి ఇతర రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబాయి రాష్ట్రాల్లో వరుసగా ధరలు రూ.46,190, రూ.50,390 ఉన్నాయి. ఇక పూణెలో కొద్దిమేర తేడాతో రూ.46,270, రూ.50,470 రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,260లు, 24 క్యారెట్ల బంగారం రూ.50,470గా ఉంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాలలో ధరలు ఎలా ఉన్నయంటే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,390లు ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,390గా ఉన్నాయి. బంగారం ధరలు తగ్గితే..వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.55,600లు వద్ద స్థిరంగా ఉంది. ఒక గ్రాము వెండి రూ.55.60లుగా ఉండగా, 10 గ్రాముల వెండి ధర రూ.556లు, 100 గ్రాముల వెండి ధర రూ.5,560లు ఉంది. విజయవాడ, హైదరాబాద్‌, విశాఖపట్నంలలో కేజీ వెండి రూ.60,700లు పలుకుతోంది..మొత్తానికి ఇది మహిళలకు  గుడ్ న్యూస్ అనే చెప్పాలి..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడు చుద్దాము..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: