భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..ఈరోజు ధరలు ఇలా..!

Satvika
పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్న కాస్త తగ్గిన బంగారం  ధరలు , నేడు మార్కెట్ లో మాత్రం భారీగా పెరిగాయి.నిన్నటి మార్కెట్ లో ఉన్న ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు పరుగులు పెడుతున్నాయి.. బంగారం ధరలు పెరిగితే వెండి కూడా అదే దారిలో నడిచింది.. బంగారం కొనాలాని భావించె వాల్లకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఈరోజు మార్కెట్ లో ధరలు భగ్గుమంటున్నాయి..కాగా, అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు భారీగా తగ్గాయని మార్కెట్ నిపుణులు  అంటున్నారు.. ఈరోజు మన దేశం లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము...


హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము..గురువారం బంగారం ధర పైకి కదిలింది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.49,000కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరిగి రూ.53,450కి చేరుకుంది. బంగారం ధరలు భారీగా పెరిగితే.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి..వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ.72,700కి చేరుకుంది.. విజయవాడ, విశాఖపట్నంలో అదే ధరలు కొనసాగుతున్నాయి.


ఇవి మన దేశంలో కొనసాగుతున్న ధరలు.. ఈరోజు పసిడి, వెండి ధరలు.. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తె. మార్కెట్‌లో బంగారం ధర దిగి వచ్చింది. ఔన్స్‌కు 0.08 శాతం తగ్గింది. ఇప్పుడు బంగారం ధరలు ఔన్స్‌కు 1910 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా అదే దారిలో నడిచింది.. వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం తగ్గుదలతో 25.89 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం గమనార్హం.. బంగారం ధరల పై ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు వంటివి ప్రభావాన్ని చూపిస్తున్నాయి.రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: