మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

Satvika
బంగారం ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రోజు వున్న ధరలు మార్కెట్ లో మరో రోజు ఉండవు. మూడు రోజులుగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు మార్కెట్ లో మాత్రం పసిడి ధరలు కిందకు దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు  కొంత మేర ఊరట కలిగిస్తున్నాయి. నిన్నటి ధర తో పోలిస్తే నేడు మార్కెట్ లో పసిడి ధర కిందకు దిగివచ్చింది.. వెండి ధరలు మాత్రం నిలకడ కొనసాగుతుంది..


హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర కేవలం రూ.130 తగ్గింది. దాంతో బంగారం ధరలు రూ. 50,050కు తగ్గింది. అదే విధంగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.90 క్షీణించింది.. ఈ మేరకు పసిడి రేటు రూ. 45,900కు క్షీణించింది. బంగారం ధరలు ఈరోజు మార్కెట్ లో తగ్గితే.. వెండి రేటు మాత్రం స్థిరంగా  కొనసాగింది. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. నేటి మార్కెట్ లో కేజీ వెండి ధర రూ.70,000 వద్దనే ఉంది..


ప్రధాన మార్కెట్ లో ఈరోజు వెండి ధరలను చూస్తె..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,000 గా ఉండగా, ముంబైలో కిలో వెండి ధర రూ.64,000 కొనసాగుతుంది. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.68,200 ఉంది. బెంగళూరులో రూ.70,000, కేరళలో రూ.70,000 లుగా,. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,000, విజయవాడలో రూ.70,000, విశాఖపట్నంలో రూ.70,000 వద్ద కొనసాగుతున్నాయి.. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో ఈరోజు ధరలను చూస్తె..బంగారం ధర పైకి కదిలింది.. ఔన్స్‌కు 0.61 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1911 డాలర్లకు చేరింది. బంగారం పెరిగితే వెండి కూడా దాదాపు అదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.19 శాతం పెరుగుదలతో 24.03 డాలర్లకు చేరింది. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: