బంగారం కొనేవారికి చేదు వార్త.. ఈరోజు ధరలు ఆకాసానికి నిచ్చెనలు వేస్తున్నాయి. పసిడి రేట్ల పరుగులు పెడుతూన్నాయి. తాజాగా మార్కెట్ లో ధరలకు రెక్కలు వచ్చాయి.. గత కొన్ని రోజులుగా థగ్గుథూ, పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేటి మార్కెట్ లో రెక్కలు వచ్చాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు..కాగా, మహిళలకు చేదు వార్త అనే చెప్పాలి. ఈరోజు పసిడి విక్రయాలు కూడా తగ్గినట్లు తెలుస్తుంది. శనివారం ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధర మాత్రం పైకి కదిలింది. మన దేశంలో బంగారం ధరలు భారీగా పైకి కదిలాయి.. ఇకపోతే వెండి కూడా అదే దారిలో నడుస్తుంది.
ఆదివారం మార్కెట్ లో పసిడి ధరలు ఇలా ఉన్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. 10 గ్రాముల పసిడి ధరపై రూ.1000 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా పసిడి ధరల పెరుగుదల్లో మార్పులు వచ్చాయి.. మన దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద వుంది. ఇక వెండి ధర కిలో రూ.400 మేర పెరిగింది.. బంగారం ధరల దారిలొనె వెండి ధరలు కూడా పైకి వెల్లాయి.. దేశంలోని వివిధ రకాల రేట్లు.. ఢిల్లీలో రూ.63,000, ముంబైలో రూ. 63,000, చెన్నైలో రూ. 67,400, బెంగళూరులో రూ. 66,900, కేరళలో రూ.67,400,హైదరాబాద్‌లో రూ. 67,400, విజయవాడలో రూ. 67,400, విశాఖపట్నంలో రూ.67,400 గా ఉంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, అలాగే అందుకు సంబంధించిన వడ్డీ మరోవైపు కరోనా, నగల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నగలు కొనుగోలు చేస్తున్న వారి సంగతి కూడా భారీగా తగ్గింది. రేపటి రోజు బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..