నిలకడగా పసిడి... నిన్నటి ధరలోనే !

Vimalatha
బంగారం ధరలు ఈ రోజు ఫ్లాట్‌గా ఉన్నాయి. నవంబర్ 19న ఉన్న ధరలే ఈరోజు కూడా కొనసాగుతున్నారు. ఈ రోజు భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,100 / 10 గ్రాములు, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,100 / 10 గ్రాములు. అయితేహైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు నేడు రూ.200 / 10 గ్రాములు పెరిగింది.
కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.02% పడిపోవడంతో $ 1861 / oz వద్ద కోట్ అయ్యాయి. అయితే స్పాట్ గోల్డ్ ధరలు 0.07 % లాభపడ్డాయి. చివరి ట్రేడింగ్ వరకు $ 1860.8 / oz వద్ద కోట్ చేయబడ్డాయి. నిన్న కామెక్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ $ 1861 / oz వద్ద ముగిశాయి. అందుకే ఈ రోజు గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్ ఉత్తర దిశగా సాగుతోంది. మరోవైపు స్పాట్ మార్కెట్లో యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.45 % లాభపడి 95.99 వద్ద ఉంది. అదే గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్‌ ను ప్రతిబింబిస్తూ భారతదేశంలో అక్టోబర్ ఫ్యూచర్‌లో ముంబై MCX బంగారం కూడా 0.45 % పడిపోయింది. చివరి ట్రేడింగ్ వరకు రూ. 49,068/10 గ్రాములు.
బంగారం ధరలు యూఎస్ డాలర్ ఇండెక్స్‌కి ఆపోజిట్ సంబంధం కలిగి ఉంటాయి. యూఎస్ డాలర్ ప్రపంచవ్యాప్తంగా పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి.  నేడు యూఎస్ డాలర్ ఇండెక్స్‌లో స్వల్ప పెరుగుదలతో బంగారం ధరలు కాస్త తగ్గాయి. అయితే ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు గత నెల కంటే నవంబర్‌లో ఎక్కువగా ట్రేడవుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ అయితే టేపరింగ్ ముగిసిన వెంటనే రేట్లను పెంచుతుంది, ఆ సమయంలో బంగారం గణనీయమైన ఒత్తిడికి లోనవడాన్ని చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: