మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు

Vimalatha
అంతర్జాతీయ ట్రెండ్‌కు అద్దం పడుతూ నవంబర్ 3న అంటే ఈరోజు భారతదేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. రూ. 110/10 గ్రాములు పెరిగింది పసిడి. కాబట్టి 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,850/10 గ్రాములు, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 47,850/10 గ్రాములు. ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా వంటి అన్ని ప్రధాన భారతీయ నగరాల్లో బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.
కామెక్స్ గోల్డ్ నవంబర్ ఫ్యూచర్స్ ఈరోజు 0.13% మాత్రమే పడిపోయింది. $1793.4 వద్ద కోట్ అయ్యింది, అయితే స్పాట్ గోల్డ్ ధరలు కూడా 0.11% మాత్రమే పడిపోయాయి. నిన్న 4.42 PM IST వరకు $1792.6/oz వద్ద ట్రేడ్ అయ్యాయి. మరోవైపు స్పాట్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 93.93గా ఉంది. అదే గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ భారతదేశంలో అక్టోబర్ ఫ్యూచర్‌లో ముంబై MCX బంగారం కూడా 0.28% పడిపోయింది. నిన్న సాయంత్రము 4.42 వరకు రూ. 47,768/10 గ్రాములకు చేరుకుంది. ఈరోజు డాలర్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి.
ముంబై : 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 46,850/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 47,850/-
ఢిల్లీ :  22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 46,950/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 51,200/-
బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 44,800/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 48,870/-
హైదరాబాద్ : 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 44,800/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 48,870/-
చెన్నై :  22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 45,080/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 49,180/-
కేరళ :  22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 44,800/- 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 48,870/-
కోల్‌కతా :  22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 47,300/- 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 50,100/-

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: