బంగారం స్వచ్ఛతను ఇలా చెక్ చేయండి

Vimalatha
నవరాత్రి ప్రారంభమైన వెంటనే బంగారం, వెండి ధరలలో పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు బులియన్ మార్కెట్లలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 200 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 47,780. అయ్యింది. ఆ తర్వాత ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 220 పెరిగి రూ. 43,800. అదే సమయంలో వెండి ధర రూ .300పెరిగింది, ఆ తర్వాత వెండి ధర కిలోకు రూ .65,200 కి పెరిగింది. దీపావళి వరకు బంగారం, వెండి ధరలలో ఇలాగె పెంపు కన్పిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మాములు రోజుల్లో కంటే బంగారం, వెండి ధరలను పండుగ రోజుల్లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాడు భారతీయులు.
అయితే కొన్న బంగారం ఎంత స్వచ్ఛమైనదో తెలుసుకోవాలన్నా ? దాని స్వచ్ఛత గురించి ఆందోళన పడే అవసరం ఉండకూడదు అనుకున్నా, బంగారం విషయంలో మోసపోకూడదు అనుకున్నా హాల్ మార్క్ ఉండాలని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. కానీ ఇంట్లో కూర్చుని కూడా బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయొచ్చు మనం.
మీరు బంగారం స్వచ్ఛతను ఈ విధంగా తనిఖీ చేయవచ్చు
మీరు ఇప్పుడు బంగారం స్వచ్ఛతను ఇంట్లోనే తనిఖీ చేయాలనుకుంటే దీని కోసం ప్రభుత్వం చొరవతో ఒక యాప్ తయారు చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. 'బిఐఎస్ కేర్ యాప్' తో కస్టమర్లు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఏదైనా ఫిర్యాదు కూడా చేయవచ్చు. చాలా ఈజీ కాబట్టి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇంట్లోనే మీ బంగారం ఎంత ప్యూర్ అనే విషయం తెలుసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: