యూఎస్ రిటైల్ అమ్మకాలకు బంగారంతో సంబంధం ఏమిటి ?

Vimalatha
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 
47,840, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,850.

 
భారతదేశం లో బంగారం ధరలు పెరగడానికి లేదా తగ్గడానికి పండుగలు, పండుగల సమయంలో డిమాండ్‌తో ఏమాత్రం సంబంధం ఉండదనే విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ బంగారం ధరలు అంతర్జాతీయ ధరల ఆధారంగా మాత్రమే మారతాయి. అంతర్జాతీయ ధరలు పెరిగితే, అమెరికా డాలర్‌ తో రూపాయి స్థిరంగా ఉన్నట్లయితే భారతదేశం లో బంగారం ధరలు మరింత పెరుగుతాయి. వాస్తవానికి ధరలపై ప్రతిబింబించేలా డ్యూటీస్ లో మార్పు కూడా జరుగుతుంది. కానీ అది చాలా అరుదుగా జరుగుతుంది.
యుఎస్ నుండి వస్తున్న డేటాకు అంతర్జాతీయంగా బంగారం ధరలు చాలా సున్నితంగా ఉంటాయి. గత వారం ఊహించిన దానికంటే రిటైల్ అమ్మకాల సంఖ్య మెరుగ్గా ఉంది. అది ప్రపంచ మార్కెట్ల లో బంగారం ధరలను దాదాపు 3% తగ్గించింది. భారతదేశంలో బంగారం ధరలు దాదాపు రూ .600 తగ్గాయి. రానున్న రోజుల్లో స్వల్పంగా బంగారం ధరలు తగ్గే అవకాశం కన్పిస్తోంది. అయితే యూఎస్ రిటైల్ అమ్మకాలకు బంగారం తో సంబంధం ఏమిటి అనేది చాలా మందికి అర్థం కాదు. అందుకే అది ప్రశ్నగానే మిగిలిపోతుంది వారిలో. పసిడి నిపుణుల నమ్మకం ఏమిటంటే బలమైన ఆర్థిక డేటా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన బాండ్ కొనుగోలు కార్యక్రమాన్ని తగ్గించుకునేలా చేస్తుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ ని తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ తగ్గినప్పుడు అది నేరుగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. అప్పుడు బంగారం ధర తగ్గుతుంది. కాబట్టి అధిక ద్రవ్యోల్బణం, బలమైన ఆర్థిక డేటా, యూఎస్ నుండి పెద్ద సంఖ్యలో ఉపాధి వంటివి బంగారం పై నేరుగా ప్రభావం చూపిస్తాయి. అంటే బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: