పసిడి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా ?

Vimalatha
ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,230.
బంగారం అనగానే మనకు ఆభరణాలు, పెట్టుబడి వంటి విషయాలు గుర్తొస్తాయి. చరిత్రలో బంగారం సంపదకు చిహ్నంగా కనిపిస్తుంది.అయితే మగువల మనసుకు ప్రత్యేకంగా ఆకర్షించే ఈ పసిడి గురించిన ఆసక్తికర విషయాలు ఎంత మందికి తెలుసు. ఆ విషయాన్నీ పెద్దగా ఎవరూ ఆలోచించరు. కేవలం బంగారం విశ్లేషకులకు మాత్రమే తెలిసిన కొన్ని అద్భుతమైన విషయాలు మీకోసం. ఈ ప్రసిద్ధ లోహం మరియు దాని ప్రత్యేక అణువు నిర్మాణం గురించి తెలుగుకుందాం.
బంగారం ఒక రసాయన మూలకం. దీని రసాయన చిహ్నం Au, పరమాణు సంఖ్య 79.
ఇతర లోహాలతో పోలిస్తే బంగారం కెమికల్ గా చాలా తక్కువ రియాక్ట్ అవుతుంది.
బంగారం విద్యుత్, వేడి ను బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకే బంగారం వేసుకున్నా షాక్ కొట్టదు.
బంగారం చాలా మృదువుగా ఉంటుంది. దీనిని సులభంగా సన్నని షీట్లు లేదా ఇతర ఆకృతులలో తయారు చేయొచ్చు.
1 చదరపు మీటరు పరిమాణంలో షీట్‌ లా కొట్టడానికి బంగారం కేవలం 1 గ్రాము సరిపోతుంది. ఇది పారదర్శకంగా కనిపించేంత సన్నగా కూడా తయారవుతుంది.
బంగారంతో సమానమైన రూపాన్ని కలిగి ఉన్న కారణంగా ఖనిజ పైరైట్ ఫూల్స్ ను కూడా బంగారం అని పిలుస్తారు.
వివిధ మిశ్రమాలను కలిపిన బంగారాన్ని (బంగారం, వెండి వంటి మరొక లోహం కలయిక) క్యారెట్లలో (k) కొలుస్తారు. స్వచ్ఛమైన బంగారం 24కే.
2009 నాటికి మానవులు 160000 టన్నుల బంగారాన్ని తవ్వినట్లు అంచనా.
గత 100 సంవత్సరాలలో దక్షిణాఫ్రికా బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసింది. ఇటీవలి కాలంలో దీనిని చైనా అధిగమించింది .
2009 నాటికి యూఎస్ఏలో 8133 టన్నుల బంగారు నిల్వలు ఉండగా, కెనడాలో 3 మాత్రమే ఉన్నాయి.
'గోల్డ్ స్టాండర్డ్' అని పిలువబడే ద్రవ్య వ్యవస్థ ఉంది. ఇది ఒక నిర్దిష్ట బరువు బంగారానికి ఒక యూనిట్ డబ్బును ఫిక్స్ చేస్తుంది.
సంవత్సరాలుగా బంగారం ఖరీదైన నగలు, నాణేలు వంటి వివిధ రకాల కళలను సృష్టించడానికి ఉపయోగించబడింది. ఆధునిక కాలంలో ఇది ఎలక్ట్రానిక్స్, డెంటిస్ట్రీ వంటి వాటికి కూడా ఉపయోగిస్తున్నారు.
క్షయ, రుమటాయిడ్, ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులలో నొప్పి, వాపును తగ్గించడంలో ఇంజెక్షన్ బంగారం సహాయపడుతుందని నిరూపించబడింది.
పతకాలు, విగ్రహాలు, ట్రోఫీలలో బంగారు పతకాన్ని అందించడాన్ని చూస్తుంటే ఉన్నాము. అకాడమీ అవార్డు, ఒలింపిక్, నోబెల్ బహుమతి విజేతలు అందరూ తమ విజయానికి గుర్తింపుగా బంగారు పతకాలను అందుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: