బంగారం కొనాలని అనుకునేవారికి ఇప్పుడు అనుకూల సమయం.. ఎందుకంటే బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా కిందకు వస్తున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ధరల్లో మార్పులు కనిపించాయి. స్వల్పంగా ధరలు కిందకు దిగివచ్చాయి. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది లో
పసిడి ధరలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈరోజు
పసిడి ధర
మార్కెట్ లో వెలవెల బోయింది. పది గ్రాముల మీద 190 మేర తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్ కూడా
పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఇది నిజంగా మహిళలకు అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి.
హైదరాబాద్
మార్కెట్ లో గురువారం
పసిడి ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 రూపాయలు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 తగ్గింది. ఈరోజు రేట్లు.. 24 క్యారెట్ల
పసిడి ధర రూ.49,470 ఉండగా, 22 క్యారెట్ల
పసిడి ధర 45, 350 ఉంది. ఇకపోతే
వెండి కూడా అదే దారిలో నడిచింది. ఈరోజు
వెండి కూడా స్వల్పంగా కిందకు దిగి వచ్చింది.
బంగారం తగ్గితే,
వెండి కూడా అదే దారిలో నడిచింది. భారీగా తగ్గింది. నేడు
మార్కెట్ లో
వెండి ధర పడిపోయింది. కిలో
వెండి ధర నిన్న 77,000 ఉండగా, ఈరోజు 76, 500 ఉంది. కేజీపై 500 మేర తగ్గింది.
వెండి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది చక్కటి వార్త అనే చెప్పాలి.. విదేశీ మార్కెట్ లో కూడా బంగారం
వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. గత కొన్ని రోజులుగా అక్కడ కూడా వీటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
మార్కెట్ లో బంగారం ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే రోజు రోజుకు ధరలలో మార్పులు వస్తున్నాయి. రేపు
మార్కెట్ లో బంగారం ,
వెండి ధరలు ఎలా నమోదు అవుతాయో చూడాలి..