నేడు బంగారం, వెండి ధరలు ఇలా.. !!

Satvika
దేశంలో మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత నెలలో దిగివచ్చిన పసిడికి ఇప్పుడు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పెరుగుతూ బంగారం కొనుగోలు చేసేవారికి షాకిస్తోంది. గత కొన్ని రోజులుగా పైకి కదిలిన ధరలు నేటి మార్కెట్ లో ఒక్కసారిగా కిందకు దిగి వచ్చాయి. బంగారం కొనాలని చూస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక పెళ్ళీళ్ల సీజన్ ప్రారంభంలోనే పసిడి ధరలు తగ్గడమనేది బంగారం ప్రేమికులకు కాస్తా ఊరట కలిగించే అంశం.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా నేడు ధరలు కిందకు దిగి వచ్చాయి. ఇది నిజంగానే ఊరట కలిగించే విషయమే..

ఇకపోతే హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలను చూస్తే.. తాజాగా ఆదివారం 10 గ్రాములపై రూ.80 నుంచి 100 వరకు పెరిగింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 వద్ద కొనసాగుతోంది. దేశంలో బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర.. తాజాగా పరుగులు పెడుతోంది. తాజాగా భారీగా పెరిగింది.

తాజాగా ఆదివారం కిలో వెండి ధరపై 100 వరకు తగ్గింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. కిలో వెండి ధర రూ.76,100 ఉంది.పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు కిందకు రావడం విశేషం.. అక్కడ ధరలు చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.40 శాతం క్షీణతతో 1771 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 26.20 డాలర్లకు చేరింది.. ఈ ధరలు మార్కెట్ లో తగ్గడానికి ముఖ్య కారణాలు..ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, ఇక ఇప్పుడు కరోనా ప్రభావం ఇలాంటి పరిస్థితులు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. ఇక రేపటి ధరలు మార్కెట్ ఎలా నమోదు అవుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: