భారీగా తగ్గిన బంగారం ధరలు..ఈరోజు రేట్లు ఇలా..!!

Satvika
బంగారం రేట్లు వరుసగా ఐదో రోజు కూడా తగ్గాయి. పండగ తర్వాత నుంచి ధర ఓ మాదిరిగా తగ్గుతుంది. ఇండియన్ మార్కెట్ లో బంగారం ధర వెల వెల బోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే గత మూడు రోజుల నుంచి స్వల్పంగా కిందకు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో కొనుగోళ్లు పెరగడం తో, ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు బంగారం ధరలు ఊరటను కలిగిస్తుండటంతో బంగారం కొనుగోళ్లు మార్కెట్ లో భారీగా పెరిగాయి..



బంగారం ధరల పై వెండి ధరలు ఆధారపడి నడుస్తున్నాయి.  గత ఏడాదిలో ఆల్ టైమ్ రికార్డు స్థాయి లో పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 340 క్షీణించింది. దీంతో రేటు రూ.50,120కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 క్షీణించింది. రూ.45,940కు తగ్గింది.



ఇక వెండి ధర విషయానికొస్తే.. కేజీ వెండి రూ.100 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.71,300కు క్షీణించింది. వెండి ధర తగ్గడానికి కారణాలు కూడా లేకపోలేదు.. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ తగ్గడం ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గుదలతో 1855 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. ఔన్స్‌కు 0.38 శాతం పెరుగుదలతో 25.65 డాలర్లకు చేరింది. ఇక మీదట బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: