పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్ లో చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గింది. రూ.50,830కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 క్షీణతతో రూ.46,600కు దిగింది. ఇక ఈరోజు మార్కెట్ లో వెండి రేటును చూస్తే..ఏకంగా రూ.1,500 పతనమైంది. దీంతో వెండి ధర రూ.70,500 పడి పోయింది.. పరిశ్రమల యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి కొనుగోళ్లు భారీగా తగ్గడం ఇందుకు ముఖ్య కారణం అని మార్కెట్ నిపుణులు అంటున్నారు..
అయితే, బంగారం, వెండి ధరలు అనేవి మార్కెట్ ను బట్టి మారుతుంటాయి..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1881 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 26 డాలర్లకు పైకి కదిలింది.. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన ఈ ధరలు ప్రస్తుతం కిందకు వస్తుండటంతో కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం పెరుగుతుంది.. మరి న్యూయర్ కు రేట్లు భారీగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. జనవరి నుంచి రేట్లు పూర్తిగా పడిపోతాయని అంటున్నారు..