పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధరలు..

Satvika
బంగారు ప్రియులకు బంగారం లాంటి వార్త.. నిన్నటి వరకు ఆకాశానికి నిచ్చెనలు వేసిన ధరలు .. నేడు వెల వెల బోయాయి.. ఆదివారం నాడు రేట్లు భారీగా తగ్గాయి. ఈ వార్త బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. గత నాలుగు రోజులు పసిడి ధరలు పెరిగిన విషయం తెలిసిందే.. తాజాగా ఇవాళ భారీగా పడిపోయాయి బంగారం ధరలు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆకాశాన్ని తాకిన ధరలు, ఆ తరువాత మార్కెట్లు తిరిగి కోలుకొని పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కేవలం దేశీయ మార్కెట్ లోనే కాదు..విదేశీ మార్కెట్ లో రేట్లు పడిపోవడంతో ఈరోజు భారీగా తగ్గాయి.

ఆదివారం రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 50, 070 కి చేరింది. బంగారం ధరలు తగ్గితే... వెండి ధర మాత్రం పెరిగిపోయింది. గత వారం రోజుల క్రితం బంగారం ధరల పై వెండి ధరలు ఆధారపడి ఉన్నాయి. కానీ ఈ రోజు మాత్రం వెండి రేట్లు పైకి కదిలాయి..200 పెరిగాయి.

వెండి రేట్లు పెరగడానికి ముఖ్య కారణం మార్కెట్ లో వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గుతుంది.. అలాగే నాణేల తయారీ, వెండి తో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గడం ప్రధాన కారణమని చెప్పవచ్చు.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం వెండి ధరలు కిందకు దిగోచ్చాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 1808 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 25.01 డాలర్లకు క్షీణించింది.. పసిడి ధరలు ఊరట కలిగిస్తున్న కూడా వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: