స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధర..!
గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్నాయి. ధర సెప్టెంబర్ 4-19వ తేదీ వరకూ స్వల్పంగా పెరిగింది. నిన్న ధర భారీ స్థాయిలో పెరిగి మళ్లీ స్థిరంగా కొనసాగుతుంది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,070, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,590కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,490కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51,490 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.53,570, 22 క్యారెట్ల ధర రూ.49,110కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,610. 24 క్యారెట్ల ధర రూ.51,590 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధర పెరిగినా వెండి ధర స్థిరంగా ఉంది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.67,900కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో పసిడి ధర పెరుగుతూ వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.54,870కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.50.360కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.67,900గా ఉంది.