పెరిగిన బంగారం ధర.. పరుగులు తీస్తున్న వెండి !
గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర సెప్టెంబర్ 4-8వ తేదీ వరకూ స్వల్పంగా పెరిగింది. మళ్లీ నిన్నటి రోజు భారీగా పెరిగింది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,560, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,100కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,510కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,510 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.52,910, 22 క్యారెట్ల ధర రూ.48,510కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,310. 24 క్యారెట్ల ధర రూ.51,610 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధరతో పాటు వెండి ధర కూడా పరుగులు తీసింది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో ధర రూ.68,500కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో పసిడి ధర పెరుగుతూ వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.54,610కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.50.060కు చేరింది. రాజధానిలో కూడా వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో ధర రూ.68,500కి చేరింది.