రాకెట్ లాగా దూసుకవెళ్తున్న బంగారం, వెండి ధరలు...!

Suma Kallamadi

రోజురోజుకీ బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటూ కుంటున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా వ్యతిరేకంగా బంగారాన్ని కొన్ని సంవత్సరాల పాటుగా పెట్టుబడిగా భావిస్తున్నారు భారతీయులు. పెట్టుబడిదారులు బంగారానికి ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూడటంతో రోజురోజుకి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. నేటి బంగారం ధరల విషయాని కొస్తే నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే..  రూ. 640 రూపాయలు పెరిగి రూ. 54,940 కి చేరుకుంది. ఇక అలాగే 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 10 గ్రాములు రూ 590 పెరిగి రూ. 50,370 కు చేరుకుంది.

 

 

ఇక నేడు ముంబై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ 50 వేల 760 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. అలాగే కే.ఏ హైదరాబాద్ మహానగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,370 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54 ,940 గా ఉంది.

 

 

ఇక బంగారం దారిలోనే వెండి కూడా పయనించింది. కేజీ వెండి ధర నేడు ఏకంగా 13 వందల రూపాయలు పెరిగి  రూ.66 వేలకు చేరుకుంది. బంగారం ధర పెరుగుదలతో చూస్తే వెండి అమాంతం రాకెట్ వేగంతో దూసుకు వెళుతుంది. ఈ బంగారం, వెండి ధరలు చూస్తే మధ్యతరగతి, పేదవారు కొనే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇలా పెరగడానికి గల కారణం చాలా మంది ప్రస్తుతం స్థిరాస్తులు, బంగారం, వెండి వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపడమే .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: