భగ్గుమంటున్న పసిడి... రికార్డు స్థాయిలో వెండి ధర..!
పసిడి ప్రేమికులకు భారీ ఝలక్. బంగారం, వెండి ధరకు మరింత రెక్కలు వచ్చాయి. గురువారం పసిడి ధర రూ. 50 వేలు దాటగా.. మరోవైపు వెండి ధర సైతం భగ్గమంది. వెండి, బంగారం ఆభరణాలు కొనాలి అనేవారికి కష్టతరంగా మారింది. యితే ఇటు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో.. దేశీ మార్కెట్లోనూ పసిడి ధర పరుగుల పెట్టిందన్నారు. దీనికి సంబంధించిన బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అటు ముంబైలో పసిడి ధర 10 గ్రాములకు రూ.50,181గా నమోదైంది. ఇకపోతే హైదరాబాద్ లో మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పిసిడి ధర రూ. 10 పెరిగి, రూ. 52,210కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 47,860 కి చేరుకుంది. ఇదిలా ఉండగా.. వెండి కూడా గత కొంతకాలంగా బంగారం బాటలోనే పయనిస్తుంది. ఢిల్లీలో నిన్న కిలోకు ఏకంగా రూ.2.550 పెరిగి రూ. 60,400కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రికార్డ్‌స్థాయిలో పలుకుతున్నాయి. దీంతో దేశీయంగా ప్రభావం పడుతోంది. రెండు మూడు రోజులుగా పసిడి కంటే వెండి ధర దూసుకెళ్తోంది. వెండి ధర నిన్నటి వరకు రెండు రోజుల్లోనే ఏకంగా రూ.6వేల వరకు పెరిగింది. మూడు రోజుల్లో రూ.8 వేలు ఎగబాకింది. దీంతో ఏకంగా రూ.60వేల మార్క్ దాటింది.
అయితే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయని నిపుణులు తెలిపారు.