బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

Vimalatha
కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ పసిడి ధర మరో సారి పెరిగింది. 10 గ్రాముల 32 క్యారెట్ల బంగారం ధర వంద రూపాయలు పెరిగి రూ. 44,300కు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 పెరిగి రూ.48,330కి చేరుకున్నాయి. వెండి మాత్రం కాస్త తగ్గింది.. నేను కేజీ వెండి ధర నాలుగు వందల రూపాయలు తగ్గి రూ.68,200 దగ్గర నిలిచింది.
అయితే బంగారం కొనుగోలుదారులు చాలా విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత విషయంలో అజాగ్రత్తగా ఉన్నారంటే కేటుగాళ్లు చేతిలో మోసపోవాల్సి ఉంటుంది. బంగారం నాణ్యతను ఎలా చూడాలో తెలుసా ? హాల్‌మార్క్ ద్వారా అది నాణ్యమైన బంగారం అని గుర్తించొచ్చు.
అసలు హాల్ మార్క్ అంటే ఏమిటి ? అంటే... హాల్‌మార్క్ బంగారం అనేది ధృవీకరించబడిన బంగారం. అంటే బంగారం నాణ్యత తనిఖీ, హామీని హాల్‌మార్కింగ్ అని పిలుస్తారు. భారత ప్రభుత్వం కింద ఒక ఏజెన్సీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అని పిలువబడుతుంది. బంగారు వస్తువు స్వచ్ఛతను, క్వాలిటీని  ధృవీకరించడానికి ఈ హాల్‌మార్కింగ్ ప్రక్రియను నిర్వహిస్తుంది. బంగారం కొనేముందు ఈ హాల్ మార్క్ ను చేసే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
బంగారం స్వచ్ఛతపై ప్రామాణికత స్టాంప్ ఉంది. హాల్‌మార్కింగ్ అంటే బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ సెంటర్లు బంగారం స్వచ్ఛతపై మీకు భరోసా ఇస్తాయి. ప్రస్తుతం దేశంలో హాల్‌మార్కింగ్ కేంద్రాలు చాలా తక్కువ. ఈ కేంద్రాలను పెంచాలనే డిమాండ్ కొనసాగుతోంది. బంగారు హాల్‌మార్కింగ్ చేసేటప్పుడు చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే హాల్‌మార్కింగ్ సెంటర్ లోగో, హాల్‌మార్కింగ్ జరిగిన సంవత్సరం. ఈ హాల్‌మార్కింగ్ కేంద్రాలన్నీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కిందకు వస్తాయి. ఆ నాణ్యతలో కూడా వివిధ రకాల తేడాలు ఉంటాయి. బిఐఎస్ 916, కేడిఎం వంటివి. వాటిని కూడా ప్రత్యేకంగా గమనించాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు కొనే బంగారంపై హాల్ మార్క్ గుర్తు ఉందో లేదో చూసి కొనండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: