బాలయ్య: మెగా-అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ ను అన్ స్టాపబుల్ వేదికగా క్లోజ్ చేసినట్లేనా.?

FARMANULLA SHAIK
నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ కార్యక్రమం తర్వాత బాలయ్య రేంజ్ మరోస్థాయికి చేరింది. యువతరానికి చేరువయ్యారు. ఎక్కడ చూసినా జై బాలయ్య అనే పాటే వినపడుతుంది. చివరకు పబ్ ల్లో కూడా చివర్లో జై బాలయ్య అనే స్లోగన్ వినపడుతుంది. అలాగే ఆహా ఓటీటీ కూడా ఈ షోవల్ల టాప్-10లో నిలబడింది. ఇలా రెండు విధాలుగా అల్లు అరవింద్, బాలయ్య.. ఇద్దరూ ప్రయోజనం పొందారు. త్వరలోనే మూడో సీజన్ ప్రారంభం కాబోతోంది.దీనికోసం మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్ వచ్చారు. తనతో సంబంధించిన షూటింగ్ ను పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో బాలయ్య బన్నీనీ ప్రస్తుత పరిస్థితులపై ఓపెన్ గా అడిగేసినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీచేయడం, అందరూ అక్కడ ప్రచారం చేయడం, నువ్వు మాత్రం నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున ప్రచారం చేయడం లాంటి విషయాలన్నీ అడిగేశారు. దీనిపై అల్లు అర్జున్ తన చిన మామయ్య పవన్ తో తనకున్న అనుబంధం గురించి వివరించడంతోపాటు నంద్యాల వెళ్లడానికి కారణాలు, అలాగే అభిమానుల మధ్య జరుగుతున్న గొడవలన్నింటికీ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఎవరి నడుమ అయినా భేదాభిప్రాయాలు ఉంటాయని అంతమాత్రాన వారి మధ్య ఇంకెప్పటికీ బంధాలు ఉండవా అన్నట్టుగా తెలిపాడట.. దీనితో ఈ టోటల్ కాంట్రవర్సీకి బాలయ్య షోతోనే తెర పడేలా ఉందని చెప్పాలి. కాగా ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అనే వివరాలు ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఇక బన్నీ మాసివ్ పాన్ ఇండియా సీక్వెల్ పుష్ప 2 తో ఫుల్ బిజీగా ఉండగా ఈ చిత్రం ఈ డిసెంబర్ 6న గ్రాండ్ విడుదలకి రాబోతుంది.
ఇదిలావుండగా బహిరంగంగా టాక్ షోలో అన్ని విషయాలను చర్చించడంతో ఈ విభేదాలకు స్వస్తి పలికినట్లవుతుందని భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్ విడుదలైన తర్వాతైనా మెగా అభిమానులకు, బన్నీ అభిమానులకు మధ్య నడుస్తున్న యుద్ధం ఆగిపోతుందని భావిస్తున్నారు. బన్నీ ఏ విషయాల మీద ఎలా స్పందించారు? బాలయ్య అడిగినదానికి ఏవిధంగా సమాధానాలిచ్చారు అనేది ఎపిసోడ్ విడుదలైన తర్వాతే స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: