కార్పోరేట్ పాఠశాల Vs ప్రభుత్వ పాఠశాల అనేలా ఇంగ్లీష్ మీడియం బోధన...!?

frame కార్పోరేట్ పాఠశాల Vs ప్రభుత్వ పాఠశాల అనేలా ఇంగ్లీష్ మీడియం బోధన...!?

FARMANULLA SHAIK
* విమర్శలను ఎదుర్కొంటూ ఇంగ్లీష్ మీడియం బోధన అమలు.!
* ఇంగ్లీష్ మీడియం బోధనలో భాగంగా ట్యాబ్ల పంపిణి.!
* చిన్నారుల ఇంగ్లీష్ స్పీచ్ తో మురిసిపోయిన జగన్.!
(ఏపీ-ఇండియాహెరాల్డ్ ): తల్లిదండ్రులుగా మనం పిల్లలకు ఇచ్చే నిజమైన మరియు విలువైన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం చదువు మాత్రమే.ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టినా సామర్థ్యం లేని వారి చేతికిస్తే అతి తక్కువ కాలంలోనే ఆస్తులు కరిగిపోయి చివరకు అప్పులపాలవ్వాల్సి వస్తుంది. అదే మన పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే అది వారికి జీవితాంతం ఉపయోగపడుతుంది. చదువు మనిషిలో ఆత్మవిశ్వాసం పెంచి బతుకు మీద వారికీ భరోసా కల్పిస్తుంది. ఎలాంటి కష్టకాలం లోనైనా వారికీ బ్రతకగలిగే ధైర్యాన్ని ఇస్తుంది. దీని గూర్చి ప్రపంచంలోని ఎందరో మేధావులు ఇదే విషయాన్ని చెప్తుంటారు.అయితే ఆంధ్రప్రదేశ్‌ గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని బలంగా నమ్మారు.కానీ నేటి కాలంలో నాణ్యమైన విద్య అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. పిల్లలకు మంచి నాణ్యమైన ఇంగ్లీష్‌ మీడియం చదువులు అందాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ధనవంతులైతే పిల్లల చదువు కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. మరి పేదలు, మధ్య తరగతి వారి పరిస్థితి డబ్బు కారణంగా  వారు దాన్ని ఎందుకు వదులుకోవాలి అని భావించిన జగన్‌ విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చూట్టారు.
దాంట్లో భాగంగా దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని తీసుకోవడమే కాక ఎంతో విజయవంతంగా దాన్ని అమలు చేసిన విధానం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం. ప్రతిపక్షాలు దీనిపై ఎన్ని విమర్శులు చేసిన జగన్‌ మాత్రం ఈ నిర్ణయంలో వెనకడుగు వేయలేదు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలనే నిర్ణయాన్ని పక్కగా అమలు చేశారు. అంతేకాక నాడు-నేడు కార్యక్రమం ద్వారా  ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను పూర్తిగా మార్చేశారు. కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా వాటిని తీర్చిదిద్దారు.జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి అంటే ప్రపంచవేదికల మీద అదరగొడుతున్న ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే ఇందుకు సమాధానం.పాఠశాల విద్యలో భాగంగా ఎనిమిది తరగతి నుండి పదవ తరగతి చదివే పిల్లలకోసం వారి చదువు పరంగా ప్రగతి సాధించాలని ట్యాబ్ లు కూడా పంపిణీ చేశారు. వాటికీ బై జ్యూస్ సంస్థతో అనుసంధానమై డిజిటల్ కంటెంట్ పిల్లలకు దగ్గర చేసేలా వీడియోస్ కూడా చేర్చారు.ఇంగ్లీష్‌ మీడియం చదువుల కోసం అప్పుల చేసి మరీ ప్రైవేటు పాఠశాలలకు పంపే తల్లిదండ్రులు గవర్నమెంట్‌ స్కూల్స్‌కే తమ ఓటు వేసారు.ఇదంతా జగనన్న తీసుకొచ్చిన మార్పే అంటూ కొనియాడారు ఏపీ ప్రజలు.
గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవని ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకు పోతాయి.అలా కాకుండా మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. అందుకే స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత పిల్లల తలిదండ్రులపై ఉందని వారు భావించాలి.అయితే దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు విద్య ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది కీలకమైన ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: