తెలంగాణ: డీయస్సీ అభ్యర్థుల కోసం అలాంటి డెసిషన్ తీసుకున్న ప్రభుత్వం...!

FARMANULLA SHAIK
తెలంగాణ డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జులై 18 నుంచి ఈ  పరీక్షలు ప్రారంభం కానున్నాయి.విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… జులై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభమై ఆగస్టు 5వ తేదీవ తేదీతో ముగియనున్నాయి. జులై 18న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనుంది విద్యాశాఖ. ఇందుకోసం 2,79,966 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తు వచ్చాయి. మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.
జులై 18న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు.అయితే ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ లో భాగంగా కొన్ని సమస్యలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరిస్తూ డి ఎస్ సి అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉంటే...అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరుకావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారమిచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో.. మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్‌లోకల్‌ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలిచ్చారు.
దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశమిస్తామని తెలిపారు. వారికి హాల్‌టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు.ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: