రూ.1000 ని.. 1T అని కాకుండా.. 1K అని ఎందుకు అంటారో తెలుసా?

praveen
ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది ఒక భాగమే. డబ్బు లేకుండా మనిషి జీవితం ముందుకు నడవదు అనేది కూడా అక్షర సత్యం అని చెప్పాలి. అయితే ప్రతిరోజు డబ్బులు ఉపయోగించేవారు.. ఇక డబ్బు విలువను బట్టి కొన్ని కొన్ని పదాలను వాడుతూ ఉంటారు. అయితే ఈ పదాల వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి అన్న విషయాన్ని మాత్రం కొంతమంది పెద్దగా పట్టించుకోరు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఒక లక్ష రూపాయలను ఇంగ్లీషులో చెప్పాలంటే 10Lఅంటారు. మిలియన్స్ ని చెప్పాలంటే  M ఏ అక్షరం వాడుతూ ఉంటారు.

 అదే కోట్ల రూపాయల గురించి మాట్లాడుకుంటూ ఉంటే Cr అని వాడటం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఎందుకో వేల గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రం 'K' అనే అక్షరం వాడుతూ ఉంటారు. సాధారణంగా వేలు అనే పదాన్ని తౌసండ్ అని పిలవడం చేస్తూ ఉంటారు. దీని ప్రకారం చూసుకుంటే ఇక పదివేలు అనే మాట్లాడటానికి 10T అని అనాలి. కానీ అందరూ కూడా 10K చెప్పడం చేస్తూ ఉంటారు. ఇలా వేల రూపాయలను పలకాల్సి వచ్చినప్పుడు టీ అనే పదానికి బదులు కే అనే పదం ఎందుకు వాడుతారు అనే విషయం చాలామందికి తెలియదు. ఇటీవల కాలంలో అయితే K కే అనే పదం ఎంతలా వాడుకోలోకి వచ్చిందో అందరికీ తెలుసు.

 అయితే ఇలా K పదం వాడుక వెనుక ఇక ఒక పెద్ద కారణమే ఉందట. 'K' అనేది వాస్తవానికి గ్రీకు పదం. దీనికి 1000 అని అర్థం వస్తుందట. గ్రీకులో 1000 నీ కిలోగ్రామ్ అని అంటారట. అందుకే షార్ట్కట్లో కిలోగ్రామ్ ని  K రాస్తూ ఉంటారట. అలా గ్రీకు పదం నుంచి వచ్చిన 'K' అనే పదం తర్వాత ఫ్రెంచ్ వారు కూడా ఉపయోగించడం మొదలు పెట్టారట. క్రమం క్రమంగా ఇక ఈ పదం ప్రపంచమంతా వాడుకలోకి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవహారాలలో 'K' అనే పదం ఒక భాగం అయిపోయింది అంటూ నిపుణులు చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: