డిగ్రీతో పనిలేకుండా కోట్లు సంపాదించే జాబ్స్ ఇవే?

Purushottham Vinay
అసలు సంపాదించడానికి చదువుతో సంబంధం లేదని ఇప్పటికే చాలా మంది కూడా ప్రాక్టికల్‌గా నిరూపించారు. నచ్చిన రంగంలో శ్రమిస్తూ, వైట్ కాలర్‌ జాబ్స్‌కు దీటుగా అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఆదాయం ఆర్జిస్తున్నవారు ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తారు.ఇక ఇలాంటి కోవకే చెందిన వాడే బ్రిటన్‌కు చెందిన ఒక ప్లంబర్. అతను కనీసం డిగ్రీ కూడా చదవలేదు. కానీ సంపాదన మాత్రం ఏడాదికి ఏకంగా రూ.2కోట్లకు పైగా ఉండటం విశేషం. ఇంతకీ అతడు చేసే పని ఏంటి? అంత సంపదాన ఎలా వచ్చింది అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక యూకేలోని కెన్సింగ్టన్‌కి చెందిన స్టీఫెన్ ఫ్రై అనే ప్లంబర్, తన యాన్యువల్‌ ఇన్‌కం £210,000 (దాదాపు రూ.2.15 కోట్లు)తో వార్తల్లో నిలిచాడు. అతనికి యూనివర్సిటీ డిగ్రీ లేనప్పటికీ, అతడు మాల్దీవులలో లగ్జీరియస్‌ వెకేషన్స్‌ను ఎంజాయ్‌ చేస్తాడు. లండన్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో అతను నివసిస్తున్నాడు. ఇరవైలలో అతను సొంత ప్లంబింగ్ బిజినెస్‌ ని ప్రారంభించాడు. సరిగ్గా పదేళ్ల క్రితం పిమ్లికో ప్లంబర్స్‌లో చేరాడు.ఆ కంపెనీలో అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు.ఫ్రై, డైలీ రొటీన్‌ చాలా బిజీగా ఉంటుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పని చేస్తుంటాడు. పని దినాలలో రాత్రంతా కూడా ఎమర్జెన్సీ కాల్స్‌ కోసం అందుబాటులో ఉంటాడు. ఇలా వారానికి 58 గంటలు మాత్రమే పని చేస్తాడు. ఈ ప్లంబర్లు చాలా తక్కువ సంఖ్యలోనే యాన్యువల్‌ శాలరీ £200,000 కంటే ఎక్కువగా పొందుతారని అంచనా. ఆశ్చర్యకరంగా పిమ్లికో ప్లంబర్స్‌లోని సగం మంది ఉద్యోగులు సంవత్సరానికి ఏకంగా £100,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.


ఇక ఎంప్లాయ్‌మెంట్‌ ప్లాట్‌ఫారం అయిన Adzuna ఇటీవల యూకేలోని 20 వృత్తుల లిస్ట్‌ను వెల్లడించింది. ఇవి అసలు యూనివర్సిటీ డిగ్రీ అవసరం లేకుండానే యావరేజ్‌ ఇన్‌కమ్‌ £33,000 (సుమారు రూ. 33 లక్షలు) కంటే ఎక్కువ జీతాలను అందిస్తాయి. ఈ లిస్టులో స్క్రమ్ మాస్టర్, ఎథికల్ హ్యాకర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ వంటి ఐటీ జాబ్స్‌ కూడా ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సిస్టమ్‌లలోని వల్నరబిలిటీస్‌ గుర్తించడంలో నైపుణ్యం కలిగిన ఎథికల్ హ్యాకర్‌లు 2023 మార్చి నాటికి యావరేజ్‌ యాన్యువల్‌ ఇన్‌కమ్‌ ఏకంగా £61,497 (దాదాపు రూ. 63 లక్షలు) అందుకుంటున్నారు.ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లు, లోకో పైలట్లు ఇంకా కమర్షియల్ పైలట్లు వంటి ఇతర వృత్తులు, గత నెలలో యావరేజ్‌ యాన్యువల్ ఇన్‌కమ్‌ ఏకంగా £50,000 (సుమారు రూ. 51 లక్షలు) మించి పోయింది. ఈ జాబ్స్‌కి యూనివర్సిటీ డిగ్రీతో అవసరం లేకపోయినా, GCSE అర్హతలు లేదా ఎక్స్‌టెర్నల్‌ సర్టిఫికేషన్స్‌ మాత్రం అవసరమని గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: