SSC : టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు?

Purushottham Vinay
SSC : టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రతి సంవత్సరం కూడా SSC ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి వాటికి ప్రిపేర్ వారు ఖచ్చితంగా అప్లై చేసుకొని ఉద్యోగం ఈజీగా పొందవచ్చు.ఇక కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సంస్థల్లో క్లరికల్ పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంటుంది.అయితే ఇప్పుడు తాజాగా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్‌ ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,409 పోస్టులని భర్తీ చేయనున్నారు.ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 17 వ తేదీతో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగియాల్సి ఉంది. 


కానీ .. తాజాగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా పొడిగించడం జరిగింది.ఇక తాజాగా విడుదల చేసిన నోటీస్ ప్రకారం.. ఈ దరఖాస్తుల ప్రక్రియను ఫిబ్రవరి 24 వ తేదీ దాకా పొడిగించారు. ఫిబ్రవరి 26 దాకా ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. మార్చి 2 ఇంకా 3తేదీల్లో దరఖాస్తుల సవరణకు కూడా అవకాశం కల్పించనున్నారు. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులని ఎంపిక చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అయితే ఇందులో అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ ఇంకా తమిళం లాంటి మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్ష రాయొచ్చు. కాబట్టి ఈ పోస్టులకు అర్హత ఇంకా అలాగే ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోండి.కాబట్టి ఇక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

SSC

సంబంధిత వార్తలు: