జేఈఈ మెయిన్‌-2023: అడ్మిట్‌ కార్డులు విడుదల?

Purushottham Vinay
మంచి ఉద్యోగం సంపాదించాలంటే మంచి పేరున్న కాలేజీలో చదువుకోవాలి. మంచి పేరున్న కాలేజీల్లో చదువుకుంటే తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది.దేశావ్యాప్తంగా ఉన్న మంచి కాలేజీల్లో సీటు రావాలంటే మంచి మార్కులతో పాటు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్ లో ఖచ్చితంగా రాణించాలి.ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు ఇంకా అలాగే ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ 2023 రాత పరీక్షకు సంబంధించి అడ్మిట్‌ కార్డుల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ అడ్మిట్ కార్డులు ఈ రోజు (జనవరి 21) విడుదలవ్వడం జరిగింది.ఇంకా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అందరూ కూడా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జనవరి 24 వ తేదీన నిర్వహించనున్న ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైటులో ఉంచడం జరిగింది.జనవరి 24వ తేదీన జరగనున్న పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను జనవరి 22 వ తేదీన వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ఇంకా ఇదే విధంగా మిగిలిన తేదీల్లో పరీక్షల అడ్మిట్‌కార్డులను వరుసగా విడుదల చేయనున్నట్లు కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. దీంతో జనవరి 24 వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా మొత్తం 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు కూడా ఎన్‌టీఏ స్పష్టం చేయడం జరిగింది.ఇక జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసి కొత్త షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. తాజా షెడ్యూల్‌ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే బీఈ, బీటెక్‌ విభాగాల్లో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష పేపర్‌ 1, పేపర్ 2 షిఫ్టుల్లో జరగనుంది. ఇవి జనవరి 24, 25, 29, 30, 31ఇంకా అలాగే ఫిబ్రవరి 1 వ తేదీల్లో జరుగుతాయి. బీఆర్క్‌ ఇంకా అలాగే బీప్లానింగ్‌ విభాగంలో పేపర్‌-2ఏ ఇంకా 2బీ పరీక్ష మధ్యాహ్నం షిఫ్ట్‌లో జనవరి 28 వ తేదీన జరుగనుంది. ఇక మెయిన్‌లో అర్హత సాధించిన వారికి జేఈఈ అడ్వాన్స్‌ ఎగ్జామ్స్ పెడతారు.జేఈఈలో సాధించిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలని కల్పిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: