గుడ్ న్యూస్: నిరుద్యోగులకు ఇన్ఫోసిస్ ఉద్యోగవకాశాలు!

Purushottham Vinay
ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకు ఇన్ఫోసిస్ ఒక మంచి శుభవార్త తెలిపింది. ఇక ఈ ఏడాది కంపెనీ తన రిక్రూట్‌మెంట్ లక్ష్యాన్ని మరింత పెంచుకుంది.దీని ప్రకారం మరిన్ని నియామకాలు ఉంటాయని కూడా వెల్లడించింది.ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే దాని వ్యాపార ప్రత్యర్థులైన TCS, wipro, HCL టెక్‌లతో పోలిస్తే మెుదటి క్వార్టర్ లో అత్యధికంగా నియామకాలను చేసుకుంది. చివరి త్రైమాసికంలో రిక్రూట్‌మెంట్‌లు అనేవి కొంచెం నెమ్మదించాయి. 2023 క్యూ1లో ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య మొత్తం 3,35,186కి చేరుకుంది. ఇక కంపెనీ మొత్తం 21,171 మంది ఉద్యోగులను నికర ప్రాతిపధికన కంపెనీలోకి చేర్చుకుంది. ఇంకా అంతకు ముందు.. మార్చి క్వార్టర్ నాటికి కంపెనీలో మొత్తం 3,14,015 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే.. మార్చి త్రైమాసికంలో కంపెనీ మొత్తం 21,948 మందిని నియమించుకుంది.ఇక ఇన్ఫోసిస్ ప్రత్యర్థి కంపెనీలైన విప్రో 15,331 మందిని ఇంకా టీసీఎస్ 14,136 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. ఈ రెండింటితో పోలిస్తే ఇన్ఫోసిస్ మాత్రం భారీస్థాయిలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఈ మూడు కంపెనీలు కలిపి సుమారు 50 వేల మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి.


విప్రో, టీసీఎస్ ఇంకా ఇన్ఫోసిస్ మూడు కలిపి టెక్ దిగ్గజాల్లో పనిచేస్తున్న మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా జూన్ చివరి నాటికి మొత్తం 11.65 లక్షలకు చేరుకుంది. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 మధ్య కాలంలో ఈ ఐటీ కంపెనీలు నికరంగా మొత్తం 2 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు ఈ కంపెనీలు ప్రకటించిన ఫలితాల ద్వారా వెల్లడైంది. దీంతో ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో టాలెంట్ వార్ అనేది ఎక్కువగా నడుస్తోంది.ఇక ప్రత్యర్థి కంపెనీలతో పోల్చితే తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కాంపిటీటివ్ రేంజ్‌లో పరిహారాన్ని కూడా ఇన్ఫోసిస్ కంపెనీ పెంచింది. ఉద్యోగులకు జీతాల పెంపు ఇంకా నియామక లక్ష్యాల పెరుగుదల స్వల్పకాలంలో కంపెనీ మార్జిన్లను ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ చర్యలతో ఉద్యోగుల వలసల రేటును భారీగా తగ్గించగలవని ఇన్ఫోసిస్ కంపెనీ భావిస్తోంది. ఇక జూన్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి వలసల రేటు 70 బేసిస్ పాయింట్లు పెరిగి 28.4 శాతానికి చేరుకుంది. ఈ రేటును తగ్గించేందుకు కంపెనీ ఈ ప్రకటనలను చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: