తెలంగాణాలో స్కూల్స్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?

VAMSI
ఎండాకాలం అలా ముగిసిందో లేదో అప్పుడే వర్షాకాలం మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలపై వరుణిడి ప్రభావం భారీగానే ఉంది. అయితే ఏపీలో కాస్త తక్కువే అయినప్పటికీ తెలంగాణాలో మాత్రం కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ఎటు చూసినా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సెలవులు మరో మూడు రోజులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు గత సోమవారం నుంచి బుధవారం వరకు విద్యాసంస్థలకు తెలంగాణా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాగా ఇవాళ్టితో ఆ సెలవులు ముగిసాయి. అయితే రాష్ట్రంలో ఇంకా వర్షాలు ఏ మాత్రము తగ్గుముఖం పట్టేలా లేదు.
కాగా ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాల చాలా వరకు నీట మునిగాయి. ఇటువంటి నేపథ్యంలో మరో నాలుగైదు రోజులపాటు ఈ వర్షాలు ఇలానే పడే అవకాశం ఉంది. దీనితో గురువారం నుంచి శనివారం అనగా (ఈ నెల 14 నుండి16) వరకు మళ్లీ ఆ సెలవులు పొడిగిస్తూ తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారికంగా కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 18 అనగా సోమవారం నుంచి మళ్ళీ స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి అని తెలియజేసారు.  
కాగా దాదాపు గత రెండు సంవత్సరముల తరువాత ఇప్పుడిప్పుడే స్కూలు బాట పట్టిన పిల్లలు కాస్తా ఇలా సెలవులు రావడంతో ఎక్కడ మళ్ళీ బడి బాట మర్చపోతారేమేా అని తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి చూడాలి. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ వర్షాలకు బయటకు రాకూడదని.. మరియు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: