B.Tech / M.Tech విద్యార్థులకు కేంద్ర సంస్థలో ఇంటర్న్‌షిప్!

Purushottham Vinay
B.Tech / M.Tech విద్యార్థులకు కేంద్ర సంస్థలో ఇంటర్న్‌షిప్..
ఇక కెరీర్‌లో మెరుగైన స్థితిలో ఉండాలి అంటే.. విద్యార్థులకు ఖచ్చితంగా పలు రకాల ఇంటర్న్‌షిప్స్ చాలా అవసరం. ముఖ్యంగా చివరి సంవత్సరం B.Tech / M.Tech చదువుతున్న విద్యార్థులకు అయితే ఇంటర్న్‌షిప్ చాలా ముఖ్యం. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ హైవేస్ ప్రాజెక్టుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.ఇక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఇంకా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లతో పాటు ఇతర ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు( అండర్ గ్రాడ్యుయేట్స్) ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక దీనికి ముఖ్యమైన అంశాలు
- చివరి సంవత్సరం BTech/ MTech చదువుతున్న విద్యార్థుల కోసం ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ ఉంటుంది.
- అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కు చెందిన కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, ఇతర ఏజెన్సీలతో కలిసి ఈ విద్యార్థులు పనిచేస్తూ వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందే అవకాశం ఉంది.
- ఇంకా విద్యార్థులు కనీసం మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నారు.
- ఇక ఆ తరువాత మరో 12 వారాల పాటు నిర్దిష్ట హైవే ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టర్ ఇంకా కన్సల్టెంట్‌కు వీరిని కేటాయిస్తారు.
- ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2022-23 అకడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది.

ఇక దరఖాస్తు విధానం విషయానికి వస్తే..
- ఇక ఈ ఇంటర్న్‌షిప్ కోసం తప్పనిసరిగా AICTE వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్న్‌షిప్‌కు అర్హత సాధించాలంటే గత సెమిస్టర్లలో 7 లేదా అంత కంటే ఎక్కువ CGPA సాధించి ఉండాలి.
- ఇంకా అలాగే అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 15, 2022 లోపు సమర్పించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: