విద్యుత్ కోతలతో 10 వ తరగతి విద్యార్థుల కష్టాలు...

VAMSI
అసలే ఎండలు బాగుంటున్నాయి. పలు ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోతోంది. మరో వైపు విద్యార్దులకు పరీక్షల సమయం. అయితే ఈ టైం ఎంత కీలక మైనది అన్నది తెలిసిందే. అసలే విద్యార్థులు రెండేళ్ల తరవాత మళ్ళీ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. దాంతో వారికి ప్రాక్టీస్ కాస్త ఎక్కువే అవసరం అవుతుంది. ఎందకంటే కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లు పెట్టడంతో పిల్ల చదువు అటకెక్కింది. దాంతో ఇపుడు మళ్ళీ చదువు, వెంటనే పరీక్షలు కావడంతో కాస్త కంగారుగా ఉన్నారు. అయినా తప్పదు కాబట్టి మంచి మార్కుల కోసం తమ సామర్థ్యాన్ని మించే కష్టపడుతున్నారు అనే చెప్పాలి.
అయితే ఇలా విద్యార్దులు వారి భవిష్యత్తు కోసం నానా తంటాలు పడి రాత్రనక పగలనకా చదువుతుంటే.. మరో వైపు తగుదునమ్మా అంటూ విద్యుత్ కోతలు విద్యార్దులకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. నిత్యం గంటల తరబడి కరెంటు కోతలతో ప్రజలకు ఎలాగో బాధలు తప్పడం లేదు. అయితే ఇప్పుడు అది విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారుతుంది. అసలే సూర్యుడు భగ్గుమంటూ చమటలు పట్టిస్తుంటే మరో వైపు ఈ విద్యుత్ కోతలతో మా పిల్లలు సరిగా చదవలేకపోతున్నారు, ఉక్కపోతతో పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేక పోతున్నారు అంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాసేపు అయితే పర్వాలేదు. కానీ రోజు గంటల కొద్దీ కరెంట్ తీస్తుంటే మా నిత్య జీవితానికే కాదు. మా పిల్లల చదువుకు కూడా ఇది సమస్యాత్మకంగా ఉంది అంటూ వాపోతున్నారు. కాగా ఈ ఏడాది పదవ తరగతి  పరీక్షలు 27వ తేదీ నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే మరో వారం రోజుల్లో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యార్దులు హడావిడిగా అదే పనిగా పరీక్షల కోసం రెడీ అవుతున్న క్రమంలో కరెంట్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: