నీట్ ఎగ్జామ్స్ లో ఎక్కువ స్కోర్ సాధించే టిప్స్!

Purushottham Vinay
నీట్ ప్రిపరేషన్‌కి ప్రిపేర్ అయ్యేవారికి ఖచ్చితంగా 11వ తరగతి అంశాలపై కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి 11వ తరగతి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చెయ్యడం తప్పనిసరి.ఇక గతంలో నీట్ పేపర్‌ను ఇంగ్లీష్ ఇంకా అలాగే హిందీ రెండు భాషలలో మాత్రమే కండక్ట్ చేసేవారు. కానీ 2017 వ సంవత్సరం నుంచి విద్యార్థులు రెండు కంటే ఎక్కువ భాషలలో పరీక్ష రాయవచ్చని ప్రకటించారు.ఇక నీట్ 2022 ఎగ్జామ్ ఇప్పుడు తెలుగులో కూడా జరగనుంది.అలాగే ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) సరిపోదు.నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న రాష్ట్ర బోర్డు విద్యార్థి ఎన్‌సీఈఆర్‌టీతో పాటు ఇతర సంబంధిత పుస్తకాలను కూడా ఖచ్చితంగా చదవాలి. నీట్ ప్రిపరేషన్‌కు కేవలం ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ మాత్రమే సరిపోదనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రాష్ట్ర బోర్డ్ విద్యార్థులు నీట్ స్టడీ మెటీరియల్స్ లేదా రిఫరెన్స్ పుస్తకాలు ఇంకా అలాగే రోజువారీ ప్రాక్టీస్ పేపర్‌లపై కూడా దృష్టి పెట్టాలి.అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్‌కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఇంకా నీట్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు తప్పనిసరిగా సిలబస్‌ను కవర్ చేయడానికి ఒక ప్లాన్ ఇంకా అలాగే స్ట్రాటజీని రూపొందించాలి. 


ప్రతి సబ్జెక్టు నుంచి కూడా టాప్ 80% చాప్టర్స్ గుర్తించాలి. 11, 12వ తరగతులకు చెందిన చాప్టర్ ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి.ఆ టాపిక్స్, సిలబస్‌లను కవర్ చేయడానికి విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ, దినేష్ ఆబ్జెక్టివ్ బయాలజీ ఇంకా ట్రూమాన్స్ బయాలజీ - వాల్యూం 1, వాల్యూం 2, ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బై OP టాండన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ బై మోరిసన్ అండ్ బోయ్డ్, ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై హెచ్‌సీ వర్మ, ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్ ఫిజిక్స్‌ బై ఐఈ ఇరోడోవ్ పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. నీట్‌కు రెడీ అవుతున్న రాష్ట్ర బోర్డు విద్యార్థులు పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఉండటం చాలా ముఖ్యం. పాజిటివ్ ఆటిట్యూడ్ తో ప్రిపేరయితే ఎక్కువ స్కోర్ సాధించే ఛాన్స్ ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: