NTPC లో ఉద్యోగాలు.. ఈరోజే ఆఖరి గడువు!
NTPC రిక్రూట్మెంట్ 2022: ఖాళీల వివరాలు విషయానికి వస్తే..
1.ఎగ్జిక్యూటివ్ ట్రైనీ - ఫైనాన్స్ (CA/CMA) - 20 పోస్టులు (UR - 20, EWS - 1, OBC - 5, sc - 3, st - 1)
2.ఎగ్జిక్యూటివ్ ట్రైనీ - ఫైనాన్స్ (MBA-Fin) 10 పోస్టులు (UR - 6, EWS - 1, OBC - 2, sc - 1)
3.ఎగ్జిక్యూటివ్ ట్రైనీ - HR 30 పోస్టులు (UR - 14, EWS - 2, OBC - 8, sc - 4, st - 2)
NTPC రిక్రూట్మెంట్ 2022: వయో పరిమితి విషయానికి వస్తే..
మార్చి 21, 2022 నాటికి అభ్యర్థి గరిష్ట వయస్సు వచ్చేసి 29 ఏళ్లు ఉండాలి.
NTPC రిక్రూట్మెంట్ 2022: ఇక జీతం విషయానికి వస్తే..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 40,000 నుండి రూ. 1,40,000 (E1 గ్రేడ్) వరకు జీతం చెల్లించబడుతుంది.
NTPC రిక్రూట్మెంట్ 2022: ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి దశలు
స్టెప్ 1: NTPC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - ntpc.co.in
స్టెప్ 2: హోమ్‌పేజీలో, 'కెరీర్' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్ట్‌ను ఎంచుకుని, దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
స్టెప్ 4: ఫారమ్‌ను సమర్పించి తరువాత భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.
అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్లు/సడలింపులు, ఎంపిక ప్రక్రియ మొదలైనవాటిని స్పష్టం చేసే వివరణాత్మక నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివి ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ: అర్హత ఇంకా ఆసక్తి గల అభ్యర్థులు ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ ఎంపిక పరీక్షకు హాజరు కావాలి. ఇక ఆన్లైన్ ఎంపిక పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ (SKT) ఇంకా అలాగే ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూట్ టెస్ట్ (EAT).