ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుండి స్కూళ్లు పునః ప్రారంభం..!!
కరోనా మహమ్మారి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను విద్యార్థులను ఉద్యోగస్తులను అందర్నీ ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో అన్ని పాఠశాలలు ప్రారంభించడానికి వీలులేకుండా ఆన్లైన్ క్లాస్ ల పేరిట విద్యార్థులకు చదువులను ఉపాధ్యాయులు బోధిస్తారు. ఈ నేపథ్యంలోనే తరగతులకు హాజరు అయ్యి చదువుకునే విద్యార్థులకు ఇంటి నుండి చదువుకునే విద్యార్థులకు చాలా తారతమ్యం ఉంటుంది. ఈ క్రమంలోనే విద్యార్థుల చదువులను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా ఒక్కొక్క రాష్ట్రంలో స్కూల్స్ తిరిగి పునః ప్రారంభం అవుతున్నాయి.. ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పాఠశాలలు పునః ప్రారంభం అయిన విషయం తెలిసిందే..
ఇక త్వరలోనే ఒడిశా ప్రభుత్వం పాఠశాలు త్వరలో ప్రారంభం చేసే విధంగా తెలియజేసింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థుల కోసం ఫిబ్రవరి 14వ తేదీ నుంచి పాటలు ప్రారంభిస్తున్నామని ఒడిశా ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ డీఈఓ ల మధ్య ఒక అధికార ప్రకటన వెలువడింది. ఫిజికల్ తరగతులను మాత్రమే ఆదేశాలు జారీ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి ఒడిశా ప్రభుత్వం
ఇక విద్యార్థులు ఆన్లైన్ తరగతులు ద్వారా వారికి సంబంధించిన వాటిని ఎంచుకోవచ్చు..కానీ ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఆన్లైన్ క్లాసులకు కచ్చితంగా హాజరు కావాలని తెలియజేశారు.. ఇక ఆఫ్ లైన్ క్లాసులకు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతాయని భిష్ణుపాద సేధి తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఉపాధ్యాయులు క్యాంపస్ కు వచ్చి శానిటైజర్ తరగతి గదులు శుభ్రం చేయాలని అధికారులు తెలియజేశారు. ఇక ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనలిని తెలియజేసింది ఒడిశా ప్రభుత్వం. ఇక ప్రస్తుతం టీకా కూడా 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్స్ ఉన్న వారికి చేస్తున్నామని తెలియజేసింది.