నేడు ఆంధ్రప్రదేశ్‌లో భారీ జాబ్‌మేళా.. ఆ 5 కంపెనీల్లోనే..?

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ స్కిల్ డెవ‌ల‌ఫ్‌మెంట్ కార్పొరేష‌న్‌ ఇటీవ‌ల వ‌రుస‌గా జాబ్‌మేళాను నిర్వ‌హిస్తున్న విష‌యం అందరికీ తెలిసిన‌దే. అయితే తాజాగా మ‌రొక జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నది ఇవాళ‌. డిసెంబ‌ర్ 27న  ఈ జాబ్‌మేళా నిర్వ‌హిస్తూ ఉన్నారు.  ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అయ్యాయి.  అయితే నోటిఫికేషన్‌లో భాగంగా వరుణ్‌ మోటార్స్‌, మీషో, క్వీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, డీమార్ట్‌ కంపెనీల్లో  ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు వివ‌రాల‌ను చూసిన‌ట్ట‌యితే..  వరుణ్‌ మోటార్స్‌లో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేప‌ట్ట‌నున్నారు.  ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా(మెకానికల్&ఆటోమొబైల్), బీటెక్(మెకానికల్), ఏదైనా డిగ్రీ పూర్తి  చేసిన అభ్యర్థులు అంద‌రూ దరఖాస్తు చేసుకోవ‌చ్చు.  అయితే ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 8,500 నుంచి రూ. 12వేల వరకు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల వయసు 18 నుండి 29 ఏండ్ల మ‌ధ్య‌లో ఉండాలి. అదేవిధంగా  ప్రముఖ ఆన్‌లైన్‌ బిజినెస్‌ మీషోలో సేల్స్ అసోసియేట్స్/ఆఫీసర్స్ విభాగంలో కూడా ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ చేసిన వారు అర్హులు. ముఖ్యంగా ఎంపికైన వారికి నెలకు రూ. 22వేలతో పాటు ఇన్సెంటీవ్‌లు కూడా అందిచ‌నున్నారు.
డీమార్ట్‌ సంస్థలో క్యాషియర్, సేల్స్ అసోసియేట్, గోడౌన్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునే వారు టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,900 నుంచి రూ. 11,500 వరకు వేత‌నం ఇస్తారు.  అభ్యర్థులు విజయవాడ, గుంటూరు, ఒంగోలు బ్రాంచ్‌ల‌లలో మాత్ర‌మే  పని చేయాల్సి ఉంటుంది. క్యూస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్  పోస్టులకు భర్తీ చేసుకునే వారు ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు జీతం ఉంటుంది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన వారు ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. ఆ త‌రువాత రెజ్యూమ్‌, విద్యార్హ‌త క‌లిగిన స‌ర్టిఫికెట్లు, ఆధార్‌, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకావాలి. అయితే ఇంట‌ర్వ్యూను ఎంఆర్ఆర్ క‌ళాశాల ఆఫ్ ఫార్మ‌సీ నందిగామ నుండి మ‌ధిర రోడ్డు, నందిగామ‌-సీఆర్‌డీఏ రీజియ‌న్‌లో ఇంట‌ర్వూ ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం 9014943757 నెంబ‌ర్‌కు సంప్ర‌దించ‌గ‌ల‌రు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: