త్వరలో UPSC NDA 2 పరీక్ష 2021 అడ్మిట్ కార్డు విడుదల..

Purushottham Vinay
ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) త్వరలో UPSC nda 2 పరీక్ష 2021 అడ్మిట్ కార్డును విడుదల చేస్తుందని భావించడం జరుగుతుంది. ఇక అందుతున్న కొన్ని నివేదికల ప్రకారం తెలిసిందేంటంటే UPSC nda 2 అడ్మిట్ కార్డ్ 2021 అక్టోబర్ 31 నాటికి అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడటం అనేది జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ఇంకా అలాగే upsconline.nic.in నుండి అడ్మిట్ కార్డును (ఒకసారి విడుదలైన తర్వాత) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక UPSC అడ్మిట్ డౌన్లోడ్ చేసుకోడానికి సిద్ధంగా వుండండి..ఇక పరీక్ష వచ్చేసి నవంబర్ 14 వ తేదీ 2021న వివిధ పరీక్షా కేంద్రాలలో ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడటం అనేది జరుగుతుంది. ఇక అధికారిక ప్రకటన ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క పరీక్షల ప్రారంభానికి మూడు వారాల ముందు అడ్మిట్ కార్డ్ విడుదల చేయబడటం అనేది జరుగుతుంది. 

ఇక అభ్యర్థులు పరీక్షకు ఒక వారం ముందు వారి అభ్యర్థిత్వానికి సంబంధించి అతని లేదా ఆమె అడ్మిట్ కార్డ్ లేదా ఏదైనా ఇతర కమ్యూనికేషన్ అందకపోతే కమిషన్‌ను సంప్రదించవచ్చు.ఇక కమిషన్ కార్యాలయానికి సమయానికి సమాచారం ఇవ్వకపోతే అడ్మిట్ కార్డులు రసీదు కానందుకు UPSC ఎటువంటి బాధ్యత వహించదు. ఇంకా అలాగే అదే సమయంలో, కార్డ్ జారీ అయిన తర్వాత, అభ్యర్థులు UPSC nda 2 అడ్మిట్ కార్డ్ 2021ని జాగ్రత్తగా చదవాలి. ఇంకా అలాగే ఏదైనా పొరపాటు జరిగితే, అభ్యర్థులు UPSC అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌కు తెలియజేయవచ్చు. ఒకవేళ ఎవరైనా తప్పుగా హాల్ టికెట్ పొందినట్లయితే, వారు దాని కోసం కమిషన్‌ను కూడా సంప్రదించే అవకాశం అనేది ఇక్కడ పుష్కలంగా వుంది.అయితే ఇక కొన్ని సాంకేతిక కారణాల వల్ల అడ్మిట్ కార్డ్‌లోని పేర్లు కొన్ని సందర్భాల్లో సంక్షిప్తీకరించబడతాయని అభ్యర్థులు జాగ్రత్తగా గమనించి తీరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: