ఎయిడెడ్ పాఠ‌శాల‌ల‌ను ఆప‌డానికి వీలు లేదు : ఏపీ హైకోర్టు

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎయిడెడ్ పాఠ‌శాలల విలీనం గురించి అమ‌రావ‌తి హైకోర్టులో విచార‌ణ చేప‌ట్టారు. ఎయిడెడ్ పాఠ‌శాల‌ల విలీనం కోసం ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఆర్డినెన్స్, జీవోల‌ను స‌వాలు చేస్తూ ఎయిడెడ్ పాఠ‌శాల‌ల విద్యాసంస్థ‌లు ఏపీ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశాయి. వాటిపై ఈ రోజు విచార‌ణ చేప‌ట్టారు. అక్టోబ‌ర్ 22 లోపు అన్ని పిటీష‌న్ల‌కు సంబంధించిన కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అక్టోబ‌ర్ 28 వ‌ర‌కు ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌పై ఎలాంటి ఒత్తిడి చేయ‌వ‌ద్ద‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.
అదేవిధంగా అంగీకారం ఇవ్వ‌లేద‌ని పాఠ‌శాల‌ల‌కు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ ఆప‌డానికి వీలు లేద‌ని స్ప‌ష్టం చేసింది హైకోర్టు.  హైకోర్టు ద‌ర్మాస‌నం ముందు ఎయిడెడ్ పాఠ‌శాల‌ల బ్యాచ్ మెట‌ర్స్ పై ఏపీ హై కోర్టు  ప్ర‌ధాన  న్యాయ‌మూర్తి అరూప్ కుమార్ గోస్వామి ద‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.  హైకోర్టులో కేసులు ఉన్నంత కాలం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. పాఠ‌శాల విద్యాశాఖ క‌మిష‌న‌ర్ ఆర్‌.జే.డీలు  డీఈఓల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది.  
మ‌రోవైపు కేసులు విచార‌ణ జ‌రుగుతున్న స‌మయంలోనే యాజ‌మాన్యాల‌ను బెదిరిస్తున్నార‌ని న్యాయ‌వాదులు విజ‌య్‌, సుబ్బారావు ద‌ర్మాస‌నం దృష్టికి తీసుకొచ్చారు.  దీనిపై ద‌ర్మాస‌నం తీర్పునిస్తూ హైకోర్టులో కేసులు ఉన్నంత వ‌ర‌కు ఎయిడెడ్ పాఠ‌శాల‌ల పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. విద్యాశాఖ‌కు సంబంధించిన అంశాల‌పై త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.   ఈ నెల 28 లోపు ఎలాంటి ఒత్తిడి చేయ‌కూడ‌ద‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ  చేస్తూ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. విల్లింగ్ ఇవ్వ‌లేద‌ని ఎయిడెడ్ పాఠ‌శాల‌ల‌కు సంబంధించిన గ్రాంట్స్ ఆప‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌రుపున న్యాయ‌వాది వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విద్యాసంస్థ‌ల‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావ‌డం లేద‌ని, ఇష్ట‌పూర్వ‌కంగా ఇవ్వ‌డం ద్వారానే ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని వెల్ల‌డించారు. విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం తిరిగి అక్టోబ‌ర్ 28 వ‌ర‌కు వాయిదా  వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: