ఐసిఎం.ఆర్ శాత్రవేత్తలకు గుర్తింపు

  ఐసిఎం.ఆర్ శాత్రవేత్తలకు గుర్తింపు  
దాదాపు రెండు సంవత్సరాలుగా  ప్రపంచం లోని మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతన్న కరోనా వైరస్ పై  పరిశోధనలు జరిపి భారత్ ను అత్యంత ప్రమాదకర పరిస్థితి నుంచి బైట పడేసిన ఘనత  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) సంస్థ దే అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఐసిఎంఆ ర్  లో జరిగిన పరిశోధనలు భారత దేశానికే కాక యావత్ ప్రపంచ దేశాలకు ఉపయుక్తమయ్యాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్  ఐసిఎంఆర్ లో జరిగిన పరిశోధనలు  వైద్య రంగ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.  భాగ్యనగరానికి చెందిన శాస్త్రవేత్తలు  అర్చన, సంతోష్ కె.కుంచా, ఉదయ్ కిరణ్, భరద్వాజ్, రాకేశ్, కార్తీక్, దివ్వాశింగ్ లతో కూడీన బృందం ఆర్ టి పిసి ఆర్ పరీక్షలలో మార్పులు తీసుకు వచ్చారు, నూతన ఆవిష్కరణలుచేశారు. కోవిడ్-19 పరీక్షలలో ముఖ్యమైనది స్వాబ్ పరీక్ష. ఈ పరీక్షలో శాస్త్రవేత్తలు నూతన మార్పులు తీసుకువచ్చారు.  ఆర్ టి పిసి ఆర్ పరీక్షలలో డ్రై స్వాబ్ ద్వారా కూడా పరీక్షలు నిర్వహించ వచ్చని కనుగొన్నారు. ఈ విషయానికి ప్రపంచానికి తెలియజేశారు.
భారత్ లో ఎక్కువగా వినియోగించిన కోవిడ్ వ్యాక్సిన్ లలో కోవాగ్జిన్ ఒకటి. ఇందులో వినియో ఔషధ ఖర్చును తగ్గించిన  ఘనత ఐసిఎంఆర్ లో భాగమైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్  ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలది. హైదరాబాద్ కు చెందిన మోేహన కృష్ణా రెడ్డి,పున్నా నాగేందర్, జగదీష్ బాబు, రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు సర్ఠిఫికేట్ ఆఫ్ మెరిట్ పురస్కారం లభించిది.
ఐసిఎం.ఆర్ సంస్థ ఆవిర్భవించి 80 సంవత్సరాలైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొవిడ్-19 పోరాటంలో నూతన ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు యవ శాస్త్రవేత అవార్డులను అందజేశారు. హైదరాబాద్ శాస్త్ర వేత్తలకు వీడియో సమావేశంలో ద్వారా ఈ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పలు అంశాలను ప్రస్తావించారు. వైద్య శాస్త్రవేత్తల ఆలోచల ఫలితంగానే భారత్ ఆరోగ్యవంతమైన దేశంగా ఉందన్నారు. యువ సైంటిస్టులు మరిన్ని వినూత్న ఆలోచనలు చేయాలని వెంకయ్య నాయుడు కోరారు. భారత దేశంలో ఆహారమే ఔషధమన్న ఆయన వ్యవసాయ రంగం పై మరిన్ని పరిశోధనలు చేయాలని యవ సైంటిస్టులను కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరా లైందన్నారు. దేశమంతా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను నిర్వహించుకుంటోందని చెప్పారు. భారత్ తర తరాలుగా ప్రపంచ మానవాళి అభ్యున్నతికి ఎంతో చేసిందని చెప్పారు. యువ సైంటిస్టులు వ్యవసాయ రంగం పై మరిన్ని పరిశోధనలు జరిపి విశ్వ మానవాళికి అందించనప్పుడే భారత్ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. మానవాళి మనుగడ పై తీవ్ర ప్రభావం చూపుతున్న పర్యావరణం పై ఐసిఎంఆర్ చేసిన పరిశోధనలు మంచి ఫలితాలను ఇచ్చిందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కితాబిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: