వర్క్ ఫ్రమ్ హోమ్ .. వంటింట్లోనే .. ఇక మావల్ల కాదు బాబోయ్ ..

frame వర్క్ ఫ్రమ్ హోమ్ .. వంటింట్లోనే .. ఇక మావల్ల కాదు బాబోయ్ ..

కరోనా చేయగా భర్తల లేదా ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇంటిలో ఉండే వాతావరణానికి కార్యాలయాలలో ఉండే వాతావరణానికి తేడా ఉంటుంది. ఎక్కడ ఉంటె అలా ప్రవర్తించాల్సి ఉంటుంది. కార్యాలయం అంటే అక్కడ ఉంటె పని లోకం, ఒత్తిడి ఆ ఇదే వేరు. ఒక్కసారి ఇంటికి వస్తే ఇక్కడ ఉండే పని, ఒత్తిడి వేరు. ఈ రెంటిని సమంగా నిర్వహించుకుంటూ ఉద్యోగస్తులు లేదా భర్తలు తమ బాధ్యతలు నెరవేర్చేవారు. ఎప్పుడైనా ఈ రెంటిలో ఉండలేని పరిస్థితి వస్తే స్నేహితులతో లేదా అజ్ఞాతంలోకి వెళ్లి కాసేపు ప్రశాంతంగా గడిపిస్తారు. కుటుంబం లో కూడా శాంతి లోపిస్తుంది అని అనిపించినప్పుడు అందరు కలిసి ఏ సినిమాకో, షికారుకో వెళ్లేవారు. అది కాస్త ఆటవిడుపుగా ఉండేది. ఇవాళా రేపు దాదాపుగా అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి వాళ్ళు ఉద్యోగస్తుల మీద పెట్టె పని ఒత్తిడి మాములుగా ఉండదు. అక్కడే పని, అక్కడే పండగలు, ఉత్సవాలు. అందుకే ఈ ఉద్యోగస్తులు ఎప్పుడైనా సెలవు దొరికితే ఎటైనా ఎగిరిపోతారు.
ఇదంతా కరోనా కు ముందు జీవితం, కరోనా రంగప్రవేశం చేయగానే 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. బుడ్డోడు స్కూల్ కు వెళ్ళేది లేదు, యజమాని ఉద్యోగానికి వెళ్లాల్సిన పనిలేదు. అందరు  ఇంటిలోనే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అన్ని రకాల ఒత్తిడి ఒక్కచోటికే చేరింది, ఇక పరిస్థితి అర్ధం చేసుకోండి. వంట పని, ఇంటిపని, ఆఫీస్ పని, వీటన్నిటి వల్ల వచ్చే ఒత్తిడి..అయినా దానిని తగ్గించుకునేందుకు కూడా బయట అడుగు పెట్టడానికి లేదు. ఇందుకే చాలా మంది లాక్ డౌన్ లో ఒత్తిడిని తట్టుకోలేక వెళ్లబుచ్చేశారు. దాని వలన బంధాల మధ్య దూరం కొన్ని చోట్ల పెరిగితే మరికొన్ని చోట్ల ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళ కష్టనష్టాలు భర్తలకు, ఉద్యోగాలలో ఉండే ఒత్తిడి ఇంట్లో వారికీ తెలిసొచ్చాయి. ఎన్ని తెలిసిన మనిషి సహజ స్వభావం, ఒత్తిడి రాగానే వెళ్లబుచ్చుకోవడం.
ఇక ఉద్యోగస్తులకు మాత్రం కార్యాలయాలలో ఉండే విధంగా వాతావరణం లేకపోవటం, ఇంట్లో  వాతావరణంలో ఎక్కువ సేపు ఉండలేకపోవటం, గతంలో ఉన్న పార్టీలు గట్రా లేకపోవడం లాంటివి బాగా ఇబ్బంది పెడుతున్నాయట. ఏడాదికి పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంటికే పరిమితం అయ్యామని, ఇంతకంటే మా వల్ల కాదంటూ కొందరు సరాసరి సంస్థలకు గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. సంస్థలు మాత్రం  నిర్వహణ ఖర్చులు తగ్గాయని సంబరపడిపోతున్నప్పటికీ, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న కష్టనష్టాలు కూడా చవిచూస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొడితే మటుకు సంస్థలు ఏమి చేయగలవు, కరోనా పోతేనే గాని  వాళ్ళు కూడా ఉద్యోగులను పూర్తిస్థాయిలో అనుమతించబోరు. అందుకే కరోనా పోవాలని కోరుకుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాల్సిందే.  ఒత్తిడి అన్నప్పుడు, అ ఆ చిత్రంలో చివరి డైలాగ్ లో(ప్రెసర్ బాల్-పిసుక్కోవాల్సిందే) చెప్పినట్టు చేసుకోవాల్సిందే, తప్పదు మరి! అందరిదీ అదే బాధ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: