కాంట్రాక్ట్ కొలువులు .. కళ్ళకద్దుకుంటున్న నిరుద్యోగులు ..

కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. సంస్థలు తమ మానవ వనరులను వీలైనంత తగ్గించుకోవటం ద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా చాలా మంది ఉద్యోగులకు ఆయా సంస్థలు ఉద్వాసన పలికారు. దీనితో ఉద్యోగ ప్రకటనలకు డిమాండ్ పెరిగింది. ఎటువంటి చిన్న ఉద్యోగం అయినప్పటికీ అభ్యర్థులు చేసుకోవడానికి సిద్దపడుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎప్పుడో ఇటువంటి నిరుద్యోగ సమస్య వెంటాడింది, మళ్ళీ కరోనా కారణంగా అలాంటి పరిస్థితి ఈ తరం ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు నియామకాలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేవిగానే ఉంటున్నాయి. అలాంటిదే ఒక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అర్హులైన వారు వారివారి ప్రయత్నం చేసి ఉద్యోగాలను పొందవచ్చు.
ఈ ప్రకటన నేషనల్ ఇన్టిట్యూట్ ఫర్ ఓపెన్ స్కూల్ నుండి వచ్చింది. ఈ సంస్థ సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులలో భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఈ నెల 6, 7 తేదీలలో ఇంటర్వ్యూ లు జరుగనున్నాయి.
ఈ ఉద్యోగాల నియామకం ఒక్క సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతున్నాయి. ఇక అర్హతల విషయానికి వస్తే, సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా అకౌంట్స్ లేదా సీఏ గ్రాడ్యుయేట్ అయ్యిఉండాలి. అలాగే ప్రభుత్వ సంస్థ నుండి కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ కన్సల్టెంట్ లో ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది. కన్సల్టెంట్ విభాగంలో మీడియా ఇంజనీర్ లో రెండు, విజిలెన్స్, యోగ అండ్ వెల్ నెస్, సివిల్ ఇంజనీర్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విభాగంలో ఒకేషనల్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయి.
ఇతర వివరాలకు సదరు ప్రకటన దారు అధికారిక వెబ్ సైట్ https://www.nios.ac.in/vacancy.aspx చూడగలరు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: