క్రీడా రంగంలో బంగారు భవిష్యత్తు..

Purushottham Vinay
క్రీడా రంగం చాలా మంచి భవిష్యత్తు వున్న రంగం అని చెప్పాలి. ఈ రంగంలో మన దేశం తరపున ఎందరో గర్వించదగ్గ ఆటగాళ్లు తయారయ్యారు. వివిధ రంగాల్లో చక్కగా రాణిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. ధ్యాన్ చంద్, మిల్కా సింగ్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పీవి సింధు,మేరీ కోమ్, సునీల్ చెత్రి లాంటి గొప్ప ఆటగాళ్లు ఇప్పుడు దేశంలోని యువతకి మంచి స్ఫూర్తిగా నిలిచారు.నిజం చెప్పాలంటే స్పోర్ట్స్‌ రంగంలోనూ అద్భుతమైన కెరీర్‌ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. దేశంలో స్పోర్ట్స్‌ కోర్సులను పిల్లలకు అందించేందుకు ప్రత్యేకంగా ‘నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ(ఇంపాల్‌)’ని కూడా సిద్ధం చేశారు. అలాగే మరెన్నో పబ్లిక్‌ ఇన్‌స్టిట్యూట్స్ ఇంకా స్పోర్ట్స్‌ కాలేజీలు పలు కోర్సులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో స్పోర్ట్స్‌ కోర్సులు కోర్సులు నేర్చుకొని మంచి భవిష్యత్తుని సంపాదించుకోండి.స్పోర్ట్స్ కి సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు పలు స్థాయిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


ఇక అవేంటంటే..బీఎస్సీ–స్పోర్ట్స్‌ కోచింగ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌, ఎంఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌, ఎంఏ స్పోర్ట్స్‌ సైకాలజి, ఎంఏ లేదా ఎంఎస్సీ స్పోర్ట్స్‌ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్‌ సైకోథెరఫీ అలాగే ఎంఎస్సీ ఇంకా ఎంఫీల్‌ అలాగే పీహెచ్‌డీ స్పోర్ట్స్‌ సైకాలజీ తదితర కోర్సుల్లో చేరే అవకాశముందట.ఇక అర్హతల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే శారీరకంగా బాగా ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి వారే ఈ కోర్సులకి అసలైన అర్హులు.కాబట్టి ఎప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్స్ కోర్సులు చేసుకుంటూ వాటి వల్ల సరైన జాబ్స్ లేక నిరోద్యోగులుగా మిగిలి పోతున్న యువతకు స్పోర్ట్స్ రంగం చక్కటి వేదిక. స్పోర్ట్స్ రంగంలో చక్కగా రాణిస్తే మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా స్పోర్ట్స్ క్వాటా లో ఈజీగా పొంద వచ్చు. కాబట్టి రానున్న యువత చదువుపైన మాత్రమే శ్రద్ధ పెట్టకుండా స్పోర్ట్స్ పై కూడా శ్రద్ధ పెడితే మంచి భవిష్యత్తుని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి వున్నవారు ఈ రంగం పై మళ్ళండి. మంచి భవిష్యత్తుని సంపాదించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: