పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం 10 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు 2021 మే 25న ముగుస్తుందని ముందే ప్రకటించినా, గడువు పొడిగించింది.ఈ ఉద్యోగాల వివరాలు ఇలా.. ఖాళీల వివరాలు చూస్తే ఎంవీ మెకానిక్-5, కాపర్ అండ్ టిన్స్మిత్-1, పెయింటర్-1, టైర్మ్యాన్-1, ఎంవీ ఎలక్ట్రీషియన్-1 లాంటి పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జూన్ 10 లోగా దరఖాస్తు చేయాలి. అసలు విషయానికొస్తే.. విద్యార్హతల వివరాలు చూస్తే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 8వ తరగతి లేదా ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.
8వ తరగతి పాస్ అయినవారు ఏడాది ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. వయస్సు 2020 జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. అభ్యర్థులు పోస్టు లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి స్పీడ్ పోస్టు ద్వారా నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్ కు అప్లై ఫామ్ ను పంపించాలి. ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగు లు ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..