ప్రస్తుతం విద్యార్థులకు గడ్డు కాలం నడుస్తుంది. కరోనా గత ఏడాది నుంచి ఇప్పటివరకు వీడలేదు.. దాదాపు ఏడాది వరకు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడేమో వరుస పరీక్షలతో సతమతమవుతున్నారు. అది కూడా తక్కువ సమయంలో పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించాలంటే మాత్రం చాలా కష్టపడాలి.. ఈ విధంగా తక్కువ కష్టపడితే ఎక్కువ లాభాలను పొందవచ్చు.. అదేలానో ఇప్పుడు చూద్దాం..
దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలు జరగనున్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు కొట్టాలని భావిస్తారు.. ఎంబీబీఎస్, బీడీఎస్‌లతో పాటు ఆయుష్ కోర్సుల్లో చేరాలంటే.. నీట్ ఎంట్రన్స్ స్కోరే ప్రధానం. నీట్ స్కోర్ ఆధారంగానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే, ఇంటర్మీడియట్ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు ఏటా పోటీ పెరుగుతోంది. అందుకే దీన్ని భారత్‌లోని అన్ని పోటీ పరీక్షల్లో కెళ్లా అత్యధిక పోటీ గల పరీక్షగా పేర్కొంటారు.
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ఏడాది నుంచే ప్రిపేర్ అవుతారు.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే..
ముందుగా చేయాల్సింది.. టీవీ లు, సోషల్ మీడియాను పక్కన పెట్టడం.. మరొకటి జంక్ ఫుడ్స్, ఇతరత్రా ఆయిల్ ఫుడ్స్ కొద్ది రోజులు పక్కన పెడితే చాలా మంచిది. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది..
నీట్ పరీక్ష కాస్త కఠినంగానే ఉంటుంది. అందువల్ల, క్రిందటి సంవత్సరంలో వచ్చిన ప్రశ్నలను సాధన చేయడం మీ ప్రిపరేషన్‌కు ఉపయోగపడుతుంది. దీని ద్వారా పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది. అందువల్ల, వీలైనన్ని ఎక్కువ మాక్ పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి. ఇది పరీక్ష సమయంలోనూ టైం మేనేజ్మెంట్కు ఉపయోగపడుతుంది..
నీట్లో నెగెటివ్ మార్కులు ఉంటాయి. కాబట్టి, తెలియని సమాధానాలను వదిలేయడమే మంచింది. ఊహించి సమాధానం గుర్తించడం వల్ల మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, సమాధానం తెలిస్తేనే గుర్తించండి.
మీకు తెలియని ప్రశ్నలు వస్తే ఆందోళన చెందకండి. ఎందుకంటే దీని ప్రభావం ఇతర ప్రశ్నలపై పడుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా లోతైన శ్వాస తీసుకొని మళ్లీ పరీక్ష ప్రారంభించండి. పరీక్షలో విజయం సాధించాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది మీపై మీకు నమ్మకం ఉండటం. దీన్ని కోల్పోకుండా పరీక్షను విజయవంతంగా ఎదుర్కోండి... విజయం సాధించండి..