కేవలం ఇంటర్‌ తోనే.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. అబ్బాయిలకు మాత్రమే..!

ఈరోజుల్లో డిగ్రీ చదవడం కామన్ అయ్యింది. డిగ్రీ ఏం ఖర్మ.. ఇంజినీరింగే రొటీన్ అయ్యింది. అయితే ఎంత చదివినా ఉద్యోగం దొరకడం మాత్రం చాలా కష్టసాధ్యంగా మారుతోంది. అందులోనూ ఇక ప్రభుత్వోద్యోగం అంటే.. విపరీతమైన పోటీ.. ఇక్కడే ఓ కీలక విషయం చాలా మంది మిస్ అవుతున్నారు. అందరూ పోటీ పడే ఉద్యోగాల వైపే చూస్తున్నారు తప్పించి.. మిగిలిన అవకాశాల వైపు చూడటం లేదు. మరి ఇంటర్‌తోనే ఉద్యోగ అవకాశం లభించడం అంటే మంచి అవకాశమే కదా.


కేంద్ర ప్రభుత్వం ఏటా.. అనేక ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. అందులో కొన్ని పోస్టులు కేవలం పది, ఇంటర్  తరగతి అర్హతతోనే భర్తీ చేస్తుంది.  అలాంటి ఓ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేసింది. అదే ఇండియన్ నావీలో సెయిల‌ర్ విభాగంలో ఖాళీగా ఉన్న సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్‌ (ఎస్ఎస్ఆర్‌), ఆర్టిఫిస‌ర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టుల‌ భ‌ర్తీ నోటిఫికేషన్. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ట్రైనింగ్‌ స‌మ‌యంలో ప్రతినెల‌ రూ.14,600 స్టయిఫండ్‌ ఇస్తారు.


అయితే ఈ ఉద్యోగాలు కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే అన్నది గమనించాలి. గ‌తేడాది 2700 పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. ఇప్పుడు కూడా ఇంతే స్థాయిలో పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇంకా పూర్తి నోటిఫికేషన్ రాలేదు. ఈనెల 26 నుంచి  ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అర్హత‌లు పరిశీలిస్తే..  60 మార్కుల‌తో ఇంట‌ర్ పాసై ఉండాలి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం శ‌రీరధారుడ్యం క‌లిగి ఉండాలి. రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. రాత‌ప‌రీక్ష 100 మార్కుల‌కు  ఉంటుంది. వంద ప్రశ్నలు గంటలో పూర్తి చేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది. నాలుగు తప్పు ప్రశ్నలకు ఒక మార్కు పోతుంది. ఎస్సీ, ఎస్టీల‌కు దరఖాస్తు ఫీజు లేదు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఏప్రిల్ 30, 2021. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌:https://www.joinindiannavy.gov.in/ చూడొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: